TG: రేపటి నుంచిఅసెంబ్లీ సమావేశాలు..హైదరాబాద్ కుచేరుకున్న KCR?

Read Time:  1 min
TG: రేపటి నుంచిఅసెంబ్లీ సమావేశాలు..హైదరాబాద్ కుచేరుకున్న KCR?
FONT SIZE
GET APP

తెలంగాణ (TG) అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.. నదీ జలాల పంపిణీ, పాలమూరు ప్రాజెక్ట్‌లపై చర్చ జరిగే అవకాశం ఉంది.. అయితే.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే హాట్‌టాపిక్‌గా మారాయి.. రేపటి (డిసెంబరు 29) నుంచి జరగనున్న ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హాజరుకానున్నట్లు పార్టీ నేతలతో కేసీఆర్ స్పష్టం చేశారు.

Read Also: KCR: అసెంబ్లీ వేళ కేసీఆర్ ఎంట్రీపై రాజకీయ చర్చలు

పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం

ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ (KCR) పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఏ ఎజెండాతో ముందుకు వస్తుందో గమనించి, దానికి అనుగుణంగా దీటుగా స్పందించాలని సూచించారు.

ముఖ్యంగా (TG) పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీ లోపల, బయట బలమైన పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, అసెంబ్లీ సమావేశాల కోసం కేసీఆర్ హైదరాబాద్‌కు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.