Suicide: కుక్కల వల్ల మనుష్యులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పలువురు చిన్నారులు మరణించారు. ఇక కుక్కల దాడిలో రేబీస్(rabies) జబ్బులకు గురై, మతిస్థిమితం లేక బాధపడుతున్న రోగులు ఎంతోమంది ఉన్నారు. నయం కాని రోగంతో మృత్యువాత పడ్డ కేసులూ ఉన్నాయి. కుక్కల ప్రమాదాన్ని గుర్తించిన సుప్రీంకోర్టు కూడా ఇటీవల వాటిపై కీలక ఆదేశాలను జారీ చేసింది. కుక్కలకు ఆహారం పెట్టేవారిపై కఠిన శిక్షలను కూడా విధించింది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? రేబీస్ సోకిందనే అనుమానంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రేబీస్తో మనోవేదనకు గురైన ఇల్లాలు
మహబూబ్నగర్(Mahbubnagar) పట్టణంలో కొత్తగంజ్ ప్రాంతంలో నరేష్, యశోధ (30) అనే దంపతులకు అనురాగ్, అక్షర(3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి ఆవరణలో పల్లీలు, డ్రైఫ్రూట్స్ ఆరబెట్టినప్పుడు వీధికుక్కలు ఎంగిలి చేశాయని, వాటినే తిరిగి వంటలో వాడినప్పటి నుంచి ఇంట్లో అనారోగ్య సమస్యలు మొదలయ్యాయని భర్త నరేష్ చెప్పారు. అంతేకాక రేబీస్ టీకాలతో పాటు ఇతర వైద్యం కూడా చేయించామని, చర్మవ్యాధుల కారణంగా యశోద తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఆయన చెప్పారు.
ఆత్మహత్యకు పాల్పడ్డ భార్య
సోమవారం ఉదయం భర్త ఉద్యోగానికి వెళ్లిన అనంతరం, భార్య యశోద ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయేముందు యశోద భర్త, కొడుకు మందులు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని గోడమీద రాసింది. నరేష్ ఉదయం 10 గంటలకు ఇంటికి ఫోన్ చేయగా, ఫోన్ ఎత్తి అమ్మ బెడ్రూమ్ నుండి బయటకు రావడం లేదని కొడుకు అనురాగ్ తండ్రికి చెప్పాడు. దీంతో కంగారుపడ్డ నరేష్ పక్కింటి మహిళకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో, ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే తల్లి, కూతుళ్లు చనిపోయినట్లుగా గుర్తించారు. యశోద తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వీధుల్లో ఇటీవల కుక్కల బెడద ఎక్కువ అవుతున్నది. వాటి సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి. మనుషుల కంటే జంతువులను అధికంగా ప్రేమించే వారు వాటికి ఆహారం పెడుతూ పోషిస్తున్నారు. కుక్కల దాడులతో ఎంతోమంది చిన్నారు చనిపోయారు. రేబీస్ రోగాలబారినపడి బాధపడుతున్నవారెందరో ఉన్నారు. యశోద, పాప మరణంతో ఆ కుటుంబ ఇల్లాలిని, పాపను కోల్పోయింది.
యశోదకు ఎందుకు మనోవేదన కలిగింది?
వీధి కుక్కలు ఆహారాన్ని ఎంగిలి చేశాయని, దాంతో రేబీస్ సోకిందని అనుమానం కలిగి, ఆరోగ్య సమస్యలు రావడంతో ఆమె తీవ్రంగా బాధపడింది.
ఆత్మహత్యకు ముందు యశోద ఏమి రాసింది?
తన భర్త, కొడుకు జాగ్రత్తగా మందులు వాడాలని గోడమీద రాసి వెళ్లిపోయింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :