📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana: బడికి వేళాయే..సిద్ధపడుతున్న పిల్లలు

Author Icon By Anusha
Updated: June 7, 2025 • 12:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంకెంతో సమయంలేదు మరో ఐదు రోజుల్లోనే స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తల్లిదండ్రులు తమ పిల్లలను ఏయే బడుల్లో చేర్పించాలని ఆలోచన చేస్తున్నారు. ఇదే తరుణంలో ప్రైవేట్ పాఠశాలల(Private schools) నిర్వాహకులు చిన్నారుల తల్లిదండ్రులను ఆకట్టుకోవడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు తమ బడుల్లోనే చేర్పించాలని ఒత్తిడి సైతం తీసుకొస్తున్నారు. ఆ హంగు ఆర్భాటాలను చూసి ఏం ఆలోచించకుండా హడావిడిగా పిల్లలను బడుల్లో చేర్పిస్తే చివరకు మీరే బాధపడతారు. ప్రస్తుతం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంతో పాటు పాఠశాలలు పునః ప్రారంభ సమయాన తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

విద్యాశాఖ వెబ్​సైట్​

పాఠశాల నిబంధనల ప్రకారం ఏ స్కూల్​ అయినా ప్రభుత్వ గుర్తింపు పొందడం తప్పనిసరి. ఇందుకు నిబంధనల ప్రకారం బడిలో అన్ని వసతులు కల్పించాలి. ఇక్కడ భవనం కూడా అదే తరహాలో ఉంటేనే ప్రభుత్వం గుర్తింపు సంఖ్యను కేటాయిస్తుంది. ఈ పత్రాన్ని ప్రదర్శించాలి. లేదంటే విద్యాశాఖ వెబ్​సైట్(Education Department website)​లోనూ గుర్తింపు పొందిన బడుల వివరాలను పొందుపరుస్తుంది. ఈ అంశాలను పరిశీలించాకే మీరు ఓ నిర్ణయానికి రావాలి.పాఠశాల ఆవరణ, తరగతి గదులు విశాలంగా ఉన్నాయా లేదో సరిచూసుకోవాలి. లేకుంటే అనుకొని సంఘటన (అగ్ని ప్రమాదం) జరిగితే మంటలు ఆర్పేందుకు అన్ని పరికరాలు ఉన్నాయా లేదా అన్న విషయంపై ఆరా తీయాలి. అగ్నిమాపక శాఖ నుంచి సైతం అనుమతి పొంది ఉండాలి.పాఠశాలల్లో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారినే ఉపాధ్యాయులుగా నియమించుకోవాలి. ఆయా అర్హతలు ఉన్నవారు ఉన్నారా? లేరా? అని ఆరా తీయడం మరువొద్దు. అన్నింటి కంటే ఇదే ప్రధానం.

Telangana: బడికి వేళాయే..సిద్ధపడుతున్న పిల్లలు

ప్రభుత్వం సూచిస్తుంది

ఆటలు ఆడించేందుకు పీఈటీ సైతం ఉండాలి.విద్యార్థులను రోజులో కనీసం 45 నిమిషాలు ఆడించాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఇందుకు మైదానం తప్పనిసరిగా ఉండాలి. ఆట వస్తువులు సైతం అందుబాటులో ఉండాలి.గతంలో పాఠశాల నిర్వహణ తీరును గమనించాలి. ఏమైనా లోపాలతో గొడవలు జరిగాయా, విద్యార్థులకు ఇబ్బంది కలిగేలా సిబ్బంది ప్రవర్తించారా అనే విషయమై ఆరా తీయాలి.ఫీజులు నిబంధనల ప్రకారం ఉన్నాయా అని తెలుసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు.మండల స్థాయి(Zone level)లో విద్యాశాఖ అధికారులను సంప్రదించి అనుమతులు, ఇతర విషయాలను తెలుసుకోవాలి.ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మకూడదు. స్వయంగా మీరే వెళ్లి ఆరా తీస్తేనే ఉత్తమంగా ఉంటుంది.

Read Also: Secunderabad: కొత్త జంట హనీమూన్ ప్రయాణం​.. ప్రమాదంలో వరుడు మృతి

#BackToSchool #NewAcademicYear #SchoolAdmissions #SchoolReopening Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.