Ration Shops : తెలంగాణలో రేపు రేషన్ షాపుల బంద్ కు పిలుపు

Read Time:  1 min
Ration Shops
Ration Shops
FONT SIZE
GET APP

Ration Card Shops : ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, అందుకు నిరసనగా రేపు (శుక్ర వారం) రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో రేపు రాష్ట్రంలోని అన్ని రేషన్ (Ration Card Shops) షాపులు మూతపడనున్నాయి. ఎన్నికల ముందు తమకు నెలకు రూ. 5వేల గౌరవ వేతనం ఇస్తామని, కమీషన్ పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి 21 నెలలు గడుస్తున్నా వాటిని పట్టించుకోవడం లేదని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆరోపించింది.

హెల్త్ కార్టుల కోసం డిమాండ్

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినట్లుగా తమకు ఐదువేల గౌరవ వేతనం ఇవ్వాలని, అలాగే డీలర్ల కుటుంబాలకు హెల్త్కా ర్డులు మంజూరు చేయాలని, దుకాణాల అద్దె, బియ్యం దిగుమతి ఛార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత ఐదునెలలుగా కమీషన్ బకాయిలతో పాటు, గన్నీ బ్యాగుల బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంపై డీలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బత్తుల రమేశ్ బాబు విమర్శించారు. తమ డిమాండ్లను నెరచేర్చుకునేందుకు రేపు రేషన్ షాపులను మూసివేస్తున్నామని, ప్రజలు తమకు సహకరించాలని సంఘం కోరుతున్నది.

Read also :

https://vaartha.com/gold-silver-prices-today-september-4-mumbai-delhi-hyderabad-chennai-bengaluru-kolkata/breaking-news/540989/

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.