📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

Telangana : ఖజానాపై ఆర్థిక నియంత్రణ చర్యలు ప్రారంభం

Author Icon By Digital
Updated: April 22, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana : ఖజానాపై ఆర్థిక నియంత్రణ – వ్యయ నియంత్రణతో పాటు ఆదాయ వనరుల పెంపుపై దృష్టి

తెలంగాణలో పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఆర్థిక చర్యలు చేపట్టింది. 6 గ్యారంటీ పథకాల అమలుతో పాటు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు వంటి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో, ఖజానాపై భారం తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వం పన్నుల ఆధారిత వసూళ్లను పెంచడమే కాకుండా, పన్నేతర ఆదాయాన్ని పెంచే వ్యూహాన్ని కూడా అమలు చేస్తోంది.విభిన్న ప్రభుత్వ శాఖల్లో నిధుల వినియోగంపై కఠిన ఆంక్షలు విధిస్తూ, అవసరమైన పనులకే నిధులు ఖర్చు చేయాలంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ముఖ్యంగా మైనింగ్ రాయల్టీలు, ఇసుక అమ్మకాలు, నిరుపయోగ భూముల విక్రయాలు, రాజీవ్ స్వగృహ హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన ఆదాయ వనరులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. భూముల విలువలను మళ్లీ సవరించి ఎక్కువగా లభించేలా చర్యలు చేపడుతోంది.ఆర్థిక శాఖ ఇప్పటికే పన్ను లీకేజీల నియంత్రణ, వ్యర్థ వ్యయాల అరికటనకు చర్యలు ప్రారంభించింది. పన్ను రహిత ఆదాయ వనరులను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలపై అధిక భారం పడకుండా అదనపు ఆదాయం సమీకరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

Telangana : ఖజానాపై ఆర్థిక నియంత్రణ చర్యలు ప్రారంభం

2024–25 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు నాటికి రాష్ట్రానికి రూ.2,00,632 కోట్లు ఆదాయం లభించగా, మొత్తం వ్యయం రూ.1,97,066 కోట్లుగా నమోదైంది. ఇందులో రెవెన్యూ ఆదాయం రూ.1,36,136 కోట్లు కాగా, వస్తు సేవల పన్ను ద్వారా రూ.46,440 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.7,033 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.29,239 కోట్లు, ఎక్సైజ్ సుంకాల ద్వారా రూ.16,808 కోట్లు వసూలయ్యాయి. పన్నేతర ఆదాయం కింద రూ.6,071.98 కోట్లు సమకూరాయి.అదేవిధంగా ప్రభుత్వం మార్కెట్ రుణాలుగా రూ.64,456.79 కోట్లు తీసుకుంది. ఇందులో ఉద్యోగుల జీతాలకే రూ.38,962.53 కోట్లు, వివిధ పథకాల కోసం రూ.73,455.82 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.24,078.06 కోట్లు, పెన్షన్లకు రూ.15,480.84 కోట్లు, సబ్సిడీలకు రూ.12,291.60 కోట్లు ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో ఖర్చులను సమర్థంగా నియంత్రిస్తూ, ఆదాయ వనరుల పెంపు ద్వారా ఆర్థిక స్థిరత సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది.

Read More : Academy Awards: 2026 ఆస్కార్ అవార్డులకు నూతన నిబంధనలు

Breaking News in Telugu Financial control Google news Google News in Telugu Latest News in Telugu Non-tax income Revenue enhancement Telangana government finance Telangana treasury Telugu News Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.