Telangana Elections: బిజెపికి మద్దతుగా 6 నుండి పవన్ ప్రచారం

Read Time:  1 min
Telangana Elections
Telangana Elections
FONT SIZE
GET APP

Telangana Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపితో కలిసి నడవాలని జనసేన నిర్ణయించింది. ఏకంగా బిజెపి మద్దతు ప్రకటిస్తోంది. ఈ నేపధ్యంలో జనసేన చీఫ్ కొణిదల పవన్ కల్యాణ్ బిజెపి, జనసేన పార్టీల అభ్యర్థుల గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 6న తెలంగాణలో పలు చోట్ల క్యాంపెయిన్లో పాల్గొంటారు.

Read Also: BC Commission :కులాల వారీగా విద్యార్థుల సమాచారం ఇవ్వండి

Telangana Elections: Pawan Kalyan to campaign from 6 in support of BJP
Telangana Elections: Pawan Kalyan to campaign from 6 in support of BJP

స్వయంగా బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొని

బీజేపీ, జనసేన క్యాంపెయిన్కు ఆయనే నాయకత్వాన్ని వహించనున్నారు. స్వయంగా బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొని ఈ రెండు పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరనున్నారు. రాష్ట్రంలోని కొన్ని అర్బన్ ఏరియాల్లో జనసేన(Janasena)కు కొంత పట్టుంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో జనసేన సైతం పోటీ చేస్తోంది. అయినప్పటికీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో అక్కడంతా జనసేన ఆ పార్టీకి మద్దతును ప్రకటించింది.

రోజుల క్రితమే తమ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తారని జనసేన ఇంఛార్జీలను సైతం నియమించింది. టికెట్లు కోరేవారికి బీఫామ్ ఇస్తామని కష్టపడి పనిచేయాలని సైతం సూచించింది. కానీ పరిస్థితులు మారాయి. బిజెపితో పొత్తు కాకుండా ఏకంగా బిజెపికే మద్దతు ఇచ్చేందుకు జనసేన అదినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీ నుంచి తెలంగాణలో బిజెపికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.