Telangana Development: రెండేళ్లలో పట్టణాలకు రూ.17వేల కోట్లు

Read Time:  1 min
Telangana Development: రెండేళ్లలో పట్టణాలకు రూ.17వేల కోట్లు
FONT SIZE
GET APP

Telangana Development : ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. రాష్ట్రంలోని 130 మున్సి కాలిటీలకు వివిధ పథకాల ద్వారా రూ.17,472.22 కోట్లు విడుదల చేసింది. వీటితో దాదాపు 3,994 అభివృద్ధి పనులు చేపట్టింది. రోడ్లు రహదారుల నిర్మాణం, వరద నిర్వహణ నియంత్రణ పనులు, చెరువులలో కాలుష్యాన్ని అరికట్టడం, కాలనీలు, బస్తీల్లో సౌకర్యాలు కల్పించడం, పబ్లిక్ పార్కులు, నీటి సరఫరా, మురుగు ఆటి వ్యవస్థలను మెరుగుపరచడానికి ఈ నిధులను ప్రణాళికాబద్ధంగా వినియోగించింది. ఈ మేరకు ముఖ్య మంత్రి కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Read Also: Telangana: నేడు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

Telangana Development: Rs. 17 thousand crores for cities in two years
Telangana Development: Rs. 17 thousand crores for cities in two years

ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం ప్రత్యేక చొరవ చూపటంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సివల్ శాఖలో సంస్కరణలు చేపట్టారు. పరిపాలన లభ్యంతో పాటు అన్ని పట్టణాల అభివృద్ధి, మెరుగైన అమల్లోకి తెచ్చారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఒకే శాఖగా ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయుడి)ని రెండుగా విభజించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో ఉన్న జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అర్బన్ విభాగంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించారు.

కోర్ అర్బన్ ఏరియా వెలుపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను మరో విభాగంగా ఏర్పాటు చేసిమరో సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించారు. హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలను అభివృద్ధి చేయాలనే భవిష్యత్తు ఆలోచనలతో ముఖ్యమంత్రి స్వయంగా ప్రణాళికలు తయారు చేయించారు. 2019 నుండి పెండింగ్లో ఉన్న స్టాంప్ డ్యూటీ నిధులు రూ .996.27 కోట్లను పట్టణాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. గతంలో రాష్ట్ర వాటా నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో అనేక అభివృద్ధి పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వాటాను వెంటవెంటనే విడుదల చేస్తుండటంతో, ఇంత
ప్రారంభమయ్యాయి.

రాష్ట్రాల ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం (ఎస్ఎఎస్సిఐ) పథకం కింద అవసరమైన కీలక సంస్కరణలను ప్రభుత్వం పూర్తి చేసింది. ఆదార్ తో సంస్కరణల అనుసంధాన సహాయంగా రూ.1,698 కోట్ల నిధులను పొందేందుకు తెలంగాణ అర్హత సాధించడం విశేషమని సిఎం కార్యాలయం పేర్కొంది.. రెండేండ్లలో కేటాయింపులు రూ.17,472.22 కోట్లు నగరాభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (యూఐ డీఎఫ్).. 130 మున్సిపాలిటీల్లో 2,374 పనులకు రూ.9,387.11 కోట్లు.b130 మున్సిపాలిటీల్లో 3,994 పనులు మున్సిపల్ శాఖలో కీలక సంస్కరణలు
85 మున్సిపాలిటీలలో 1,166 పనులకు రూ.1,896,96 కోట్లు. ట్రాన్స్ ఫర్ డ్యూటీ కింద 110 మున్సిపాలిటీల్లో రూ.462.19 కోట్లు కేటాయింపు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.