📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Telangana: త్వరలో ల్యాండ్ ట్రిబ్యునల్స్

Author Icon By Ramya
Updated: June 20, 2025 • 10:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సర్కార్ కీలక నిర్ణయం

Hyderabad: తెలంగాణ (Telangana) ప్రభుత్వం భూ వివాదాల పరిష్కారానికి ల్యాండ్ ట్రిబ్యునళ్లను (Land Tribunals) ఏర్పాటు చేయనుంది. కలెక్టర్ స్థాయిలో న్యాయం జరగని వారు ట్రిబ్యునళ్లను ఆశ్రయించవచ్చు. రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే భూభారతి చట్టంలో అప్పీళ్ల వ్యవస్థను పటిష్టం చేశారు. తహసీల్దార్ ఉత్తర్వులపై ఆర్జీవోకు, ఆర్డీవో ఆర్డర్ పై కలెక్టర్కు, కలెక్టర్ అప్పిల్ పై ల్యాండ్ ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా. సమస్యలు పరిష్కరించబడతాయి. తెలంగాణ (Telangana) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూ వివాదాల పరిష్కారం కోసం ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. త్వరలోనే వీటిని ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది.

భూ సమస్యలు కలెక్టర్ స్థాయిలో పరిష్కరించే చర్యలు

భూ సమస్యలన్నింటిని.. కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు ప్రారంభించింది. అయితే కలెక్టర్ స్థాయిలో తమకు న్యాయం జరగలేదని భావిస్తే.. అలాంటి వారు ల్యాండ్ ట్రిబ్యునళ్లను
నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి వెసులుబాటు ఉంది. భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలిస్తే రాష్ట్రంలో భూ సమస్యలు పెద్ద ఎత్తున పెండింగ్లో ఉన్నాయనే విషయం అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ల్యాండ్ ట్రిబ్యునళ్ల ఏర్పాటుపై ఆలోచన చేస్తుంది. అయితే రాష్ట్రంలో ఎన్ని ల్యాండ్ ట్రిబ్యునళ్ల అవసరం ఉంది.. ప్రతి జిల్లాకు ఒక ట్రిబ్యునల్ ఉండాలా.. లేక 3, 4 జిల్లాలకు కలిపి ఒకటి ఏర్పాటు చేయాలా అనే అంశాలపై అధికారులతో చర్చించి.. దీనిపై అంతిమ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

భూమి సమస్యలపై ప్రభుత్వం చొరవ

ఈ అంశంపై ఇప్పటికే అధికారులతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. ఇదిలా ఉంటే.. ఆర్వోఆర్2020లో అప్పీళ్ల వ్యవస్థ లేదు. దీని వల్ల సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూమికి సంబంధించి ఎంత చిన్న సమస్య రిజెక్ట్ అయినా.. తప్పక సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేది. భూసమస్యల పరిష్కారం కోసం సామాన్యులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగలేక.. లాయర్లకు వేలల్లో ఫీజులు చెల్లించలేక తీవ్రంగా ఇబ్బంది. భూభారతికి చట్టంలో ఆప్పీళ్ల వ్యవస్థను తీసుకువచ్చింది. ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో అప్పీళ్లు ఏర్పాటుచేసింది. దీని వల్ల సామాన్యులకు ఏదో ఒక స్థాయిలో వారి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం కల్పించింది.

భూభారతి మార్గదర్శకాలలో ల్యాండ్ ట్రిబ్యునల్‌లు

అంతేకాక భూభారతి చట్టం (Land Act) మార్గదర్శకాల్లోనే ల్యాండ్ ట్రిబ్యునళ్ల ఏర్పాటును పొందుపరిచారు. రెవెన్యూ, సదస్సులో పెద్ద ఎత్తున భూ వివాదాలు నమోదు కావడంతో త్వరలోనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక భూభారతిలో ఉన్న అప్పీళ్ల వ్యవస్థ ద్వారా ప్రజలు తమ భూమి సమస్యలపై తహసీల్దార్ జారీ చేసిన ఉత్తర్వుల మీద రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో)కు 30 రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చు. అలాగే, ఆర్డీవో ఆర్డర్పై జిల్లా కలెక్టర్కు 60 రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చు. చివరకు మూడో దశలో.. కలెక్టర్ అప్పిల్పై 30 రోజుల్లో ల్యాండ్ ట్రిబ్యునలు అప్పీల్ చేసుకోవచ్చు. కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా భూమి సమస్యలను ఈ ల్యాండ్ ట్రిబ్యునల్ లోనే పరిష్కరించుకోవచ్చు. దీని వల్ల సమయం, డబ్బు వృథా కాదని భావిస్తున్నారు.

Read also: Nita Ambani : బల్కంపేట అమ్మవారికి నీతా అంబానీ కోటి రూపాయల విరాళం

#Bhoobharati #CivilCourtFreeJustice #CollectorLevelJustice #JusticeToFarmers #LandDisputeResolution #LandJustice #LandTribunals #LegalReforms #NewAppealSystem #PublicRelief #RDDO #RevenueReforms #RevenueSadassu #RuralFarmersRight #Tahsildar #TelanganaGovernment #TelanganaLandIssues #TelanganaUpdates #TRSInitiative Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.