📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

Telangana: తెలంగాణ ప్రజలు అధిక మాంసప్రియులు

Author Icon By Anusha
Updated: June 3, 2025 • 3:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో మాంసాహార వినియోగంలో తెలంగాణ రాష్ట్రం పరిమాణం పరంగా మొదటి స్థానంలో నిలిచింది.నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (NMRI) సర్వే ప్రకారం,దేశంలో మాంసాహార వినియోగం పరిమాణం పరంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణలో సగటున ఒక్కొక్కరు నెలకు 2 కిలోల మాంసం (సంవత్సరానికి దాదాపు 24 కిలోలు) తింటున్నట్టు ఈ సర్వే వెల్లడించింది. ఇది జాతీయ సగటు (నెలకు 0.6 కిలోలు లేదా సంవత్సరానికి 7 కిలోలు) కంటే మూడు రెట్లు అధికం అని NMRI, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.మాంసాహారం తినేవారి సంఖ్యాపరంగా చూసుకుంటే తెలంగాణ దేశంలోనే ఏడో స్థానంలో ఉందని జాతీయ ఆరోగ్య, కుటుంబ సర్వే (NFHS) నివేదిక తెలిపింది.

అధికంగా

టాప్ ప్లేస్‌లో నాగాలాండ్‌ ఉండగా ఆ రాష్ట్ర జనాభాలో 99.8% మంది మాంసాహారం తింటున్నట్టు వెల్లడైంది. తెలంగాణ జనాభాలో 97.4 శాతం మంది మాంసాహారం తింటున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన మాంసాహారం ఎక్కువగా తింటున్నట్టు సర్వేలో బయటపడింది. నాగాలాండ్, బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువగా చేప(Fish)లు తింటుండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో చికెన్, మటన్‌తో పాటు చేపలు అధికంగా తింటున్నారు. ఒడిశాలో రొయ్యలు, త్రిపురలో పందిమాంసం, గోవాలో చేపలు, పీతల వంటి సీఫుడ్‌కు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.

Telangana

నిపుణులు

ప్రస్తుతం తెలంగాణలో పెరుగుతున్న మాంసం డిమాండ్ ధరల పెరుగుదలకు దారితీస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో మటన్ ధర రూ.1,000 వరకు చేరుకుంది. ఇది అంతర్జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ. తెలంగాణ(Telangana) మాంసం అవసరాల్లో దాదాపు 50 శాతం జంతువుల దిగుమతులపై ఆధారపడుతుందని నిపుణులు అంటున్నారు. దిగుమతులకు అంతరాయం ఏర్పడితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పశుసంపద కేవలం ఎనిమిది నెలల డిమాండ్‌ను మాత్రమే తీర్చగలదని దీనివల్ల ధరలు 50 శాతం పైగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Read Also: Bhu Bharati: నేటి నుంచి అమలు కానున్న భూ భారతి

#IndiaStats #MeatConsumption #MeatLovers #telangana #TopState Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.