Ameerpet Fire Accident: మైత్రివనం అగ్నిప్రమాదం పై స్పందించిన తలసాని

Read Time:  1 min
Ameerpet Fire Accident: మైత్రివనం అగ్నిప్రమాదం పై స్పందించిన తలసాని
FONT SIZE
GET APP
Ameerpet Fire Accident: మైత్రివనం అగ్నిప్రమాదం పై స్పందించిన తలసాని
Ameerpet Fire Accident: మైత్రివనం అగ్నిప్రమాదం పై స్పందించిన తలసాని

Ameerpet Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేట చౌరస్తా మైత్రివనం వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్‌ భవనం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నీలగిరి బ్లాక్‌లోని రాందేవ్ ఇన్ఫోటెక్, శివమ్ టెక్నాలజీ దుకాణాలలో మంటలు అలముకున్నాయి. ఈ భవనంలో కోచింగ్ సెంటర్‌లు ఉంటాయి. దీనితో ఆయా కోచింగ్ సెంటర్‌లలోని విద్యార్థులు కిందకు వచ్చేశారు. విద్యార్థులను పోలీసులు, హైడ్రా సిబ్బంది నిచ్చెనల ద్వారా కూడా సురక్షితంగా తీసుకువచ్చారు.

Read Also: Chevella News: చేవెళ్ల ఆలయ పుష్కరిణిలో మృతదేహం

అదృష్టవశాత్తు విద్యార్థులకు ఎలాంటి అపాయం జరగలేదు

నీలగిరి భవనాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఘటనకు గల వివరాలను పోలీస్, ఫైర్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదృష్టవశాత్తు విద్యార్థులకు ఎలాంటి అపాయం జరగలేదని, అయితే నగరంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.