हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Surrogacy Scam : సరోగసీ ముసుగులో వెలుగులోకి కొత్త అక్రమాలు – తల్లితనం కోసం లక్షలు ఇవ్వాల్సిందే

Shravan
Surrogacy Scam : సరోగసీ ముసుగులో వెలుగులోకి కొత్త అక్రమాలు – తల్లితనం కోసం లక్షలు ఇవ్వాల్సిందే

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన యూనివర్సల్ (Universal) సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న. అమ్మతనం కోసం వచ్చిన దంపతులకు ఐవిఎఫ్, ఐయూఐ, సరోగసీ తదితర పేర్లతో వారి వద్ద నుంచి రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేసి రూ. కోట్లకు పడగలెత్తినట్లు సమాచారం. ఈ మోసాల్లో సహకరించిన వైజాగ్ సృష్టి బ్రాంచ్ మేనేజర్ కల్యాణికి దా. నమ్రత ఖరీదైన విల్లా బహుమతిగా అందజేసినట్లు తెలిసింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సరోగసీ ముసుగులో, అక్రమాలకు పాల్పడిన డాక్టర్ నమ్రతను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది.

అక్రమ సరోగసీ, శిశు విక్రయాలకు సంబంధించి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ యజమాని డాక్టర్ ఆథలూరి నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్ణతో సహా మరికొంత మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సరోగసీ పేరిట శిశు అక్రమ విక్రయాలకు పాల్పడిన డాక్టర్ నమ్రత, జయంత కృష్ణలను కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు సికింద్రాబాద్ కోర్టును కోరారు.
నమ్రత వద్ద సరోగసీ, ఐవిఎఫ్ కోసం వచ్చిన వారి వివరాలు లభ్యమయ్యాయని, మరిన్ని విషయాలు రాబట్టేందుకు వారం రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గురువారం డాక్టర్ నమ్రతను 5 రోజుల పోలీసు కస్టడీకి (Police custody) అనుమతించింది. ప్రస్తుతం చంచల గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న డాక్టర్ నమ్రతను పోలీ సులు శుక్రవారం ఉదయం కస్టడీలోకి తీసుకోనున్నారు. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు..

ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. సరోగసీ చేయక పోయినా చేసినట్లు నమ్మించి పలువురు దంపతులను మోసం చేశారని, ఈ విషయాన్ని డాక్టర్ నమ్రత అంగీక రించారని పేర్కొన్నారు. రాజస్థాన్ దంపతులను సరోగసీ విషయంలోనూ నమ్రత మోసం చేశారు. వాళ్లు డీఎన్ఏ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకునే ప్రయత్నం చేశారు.
డాక్టర్ నమ్రత కొన్ని రోజుల సమయం ఇస్తే తప్పును సరిదిద్దుతామని వారికి చెప్పారు. వారు వినకపోవడంతో తన కుమారు డితో రాజస్థాన్ దంపతులను బెదరించారు. సరోగసీ పేరుతో సృష్టి సెంటర్ చాలా మోసాలు చేసింది. ఎపిలో కొంతమంది ఎఎన్ఎంల సహాయం కూడా తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రి ఆనస్థీషియాన డాక్టర్ సదానందం వీరికి పూర్తిస్థాయిలో సహకరించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

Surrogacy Scam

ఆక్రమ సరోగసీ, నవజాత శిశువుల కొనుగోలులో కల్యాణి కీ రోల్ పోషించినట్లు సమాచారం. అక్రమాల ద్వారా వచ్చిన ప్రొఫిట్ను కల్యాణికి డాక్టర్ నమ్రత షేర్ చేసినట్లు గుర్తించారు. విశాఖపట్నంలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో 2012లో ఎఎన్ఎమ్ నర్స్ గా చేరిన కల్యాణి సేవలను గుర్తించి, 2020లో విశాఖపట్నం బ్రాంచ్కు మేనేజర్ డాక్టర్ నమ్రత అపాయింట్ చేసింది. అప్పటి నుంచి సృష్టి ఫెర్టిలిటీలో మేనేజర్ బాధ్యతలు నిర్వహిస్తున్న కల్యాణి.. నమ్రత చెప్పింది చేసినందుకు కల్యాణికి ఖరీదైన విల్లా బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

విశాఖపట్నంలోని ఓషియన్ వ్యూ అపార్ట్మెంట్ న్ను వినియోగిం చుకుంటున్న కల్యాణి ఆర్ధిక ఇబ్బందుల కారణగా నమ్రత చేసే మోసాలకు సహకరించింది. సృష్టి ఫెర్టిలిటీ లావాదేవీల వ్యవహారాలు మొత్తం కల్యాణి చూసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో తేలింది. ఇక హైదరాబాద్కు చెందిన రాజస్థాన్ దంపతులు మొదటిగా కలిసింది కల్యాణినే.. జూన్ 5న మగ బిడ్డకు జన్మనిచ్చిన అసోం మహిళ ఆ శిశువును కల్యాణి రాజస్థాన్ డంఎ తులకు అప్పగించింది. విశాఖపట్నంలో కల్యాణికి రాజస్థాన్ దంపతులు రూ.2 లక్షలు అదనంగా చెల్లించారు.

అయితే బాబుకు జాండిస్ ఉందని చెప్పి విశాఖపట్నంలోని లోటస్ హాస్పిటల్లో జాయిన్ చేయాలని కల్యాణి చెప్పినట్లు సమాచారం. ఇక నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షులను తప్పుదోవ పట్టిస్తూ, సాక్ష్యులను తారుమారు చేసే అవకాశం ఉందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో 39 మంది సాక్ష్యాలను రిపోర్టులో రిపోర్టులో జోడించారు. కల్యాణి అచ్చయమును ట్రాన్సిట్ ట్రాన్సిట్ ద్వారా వైజాగ్ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చామని, పోలీసుల తనిఖీల్లో దొరికినా పేషెంట్సు సంబంధించిన వందల కేసు షీట్స్, రికార్డులు స్వాధీనం చేసుకున్నాం.. నవజాత శిశువులను కొనుగోలుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు.

READ MORE :

https://vaartha.com/forest-department-dont-kill-tigers-by-poisoning-them-thats-a-crime/telangana/524242/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870