హైదరాబాద్ : కల్లు కాంపౌండు(Toddy Compound)లపై ప్రత్యేకంగా దాడులు నిర్వహించాలని ఎన్ఫోర్స్ మెంటెరెక్టర్ షానవాజ్ ఖాసీం ఇచ్చిన అదేశాల మేరకు దాడులను ముమ్మరం చేశారు. హెచ్ఎఫ్, ఏ టీం లీడర్ అంజిరెడ్డి టీమ్లు నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 32 లీటర్ల కల్లు ను అక్రమంగా రవాణ చేస్తూ ఉండగా స్వాధీనం చేసుకున్నారు. ఒక్క బైక్ను సీజ్ చేసి, శాంపిల్ తీసుకున్నారు. కాంబ్లే గిరిధరిపై కేసు నమోదు చేశారు. ఎస్టిఎఫ్ సిసిఐ వెంకటేశ్వర్ల(Venkateswarulu) అధ్వర్యంలో గోల్కోండ, శంషాబాద్ బండ్లగూ(golkonda, Shamshabad, bundlaguda) ప్రాంతాల్లో కల్లు కాంపౌండ్లలో తనిఖీలు నిర్వహించి కల్లు శాంపిళ్లను సేకరించారు.

సిఐ నాగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు
సిఐ నాగరాజు ఆధ్వర్యంలో మైలార్దేవరపల్లి హైదర్ూడ, ముద్దో వ్వాల, జంగంపేట్, ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అన్ని కల్లు దుకాణాల్లో శాంపిళ్లను సేకరించారు. ఎస్టిఎఫ్బి టీం గద్వాల, రాయన్పేట, ఏదుర్తి నుంచి మసాయిపేట ప్రాంతాల్లో సిఐ బిక్ష్మారెడ్డి, సిఐ బిక్ష్మారెడ్డి, ఎస్ఐ బాలరాజులతోపాటు సిబ్బంది కలిసి 6 చోట్ల దాడులు నిర్వహించారు. ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు, లైసెన్స్లు లేకుండా కల్లు దుకాణాలను నిర్వహిస్తుండంతో ఈ కల్లు కంపౌండ్లోని ఉన్న కల్లును నేలపాలు చేశారు. మరో 595 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకుని అవసరమైన శాంపిల్స్ ను తీసుకున్నారు. మల్లయ్య, నరేందర్ కృష్ణ, వెంకటేష్ పద్మమ్మలపై కేసు నమోదుచేసి వారిని గద్వాల ఎక్సైజ్ స్టేషన్ అప్పగించారు. నాగర్ కర్నూల్ ఎక్సైజ్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బందితో కలిసి 350 లీటర్ల అనుమతి లేని కల్లును స్వాధీనం చేసుకుంటున్నారు. మంగూనూర్, బిజినేపల్లి ప్రాంతాల్లో ద్కాడలు నిర్వహించారు. నాగర్ కర్నూల్ డిటిఎఫ్ సిఐ సిబ్బంది కలిసి ఒక వాహనంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న 31.2 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు .
Read hindi news: hindi.vaartha.com
Read Also : Hindi Language : హిందీ భాషపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు