📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Vertical Gardens: వర్టికల్​ గార్డెన్స్​ లోని ప్రత్యేకతలు

Author Icon By Vanipushpa
Updated: May 24, 2025 • 5:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నగర సుందరీకరణ, హరితహారంలో భాగంగా నాలాల వద్ద దుర్వాసన రాకుండా జీహెచ్​ఎంసీ(GHMC) లక్షలాది మొక్కలు ఏర్పాటు చేసింది . ఫ్లైఓవర్ల కింద, ఇతర బహిరంగ ప్రదేశాలలో మూసీ నది పరివాహక ప్రాంతంలో దుర్వాసన రాకుండా నగర సుందరీకరణ, గాలిని శుభ్రపరిచేందుకు నిలువుగా మొక్కలను పెంచుతున్నారు. సుమారు 10 నుంచి15 అడుగుల వరకు వీటిని పెంచుతున్నారు. ఇవి చూపరులకు ఆహ్లాదంతోపాటు ఫుట్ పాత్‌(Footpath) ల దగ్గర వ్యాపారాలు చేసుకునే వారికి సైతం ఆసరాగా నిలుస్తున్నాయి. చదును స్థలాన్ని వాడకుండానే మొక్కలను పెంచే ఈ గార్డెన్స్(Garden) నగరంలో చాలా ప్రాంతాల్లో కనువిందు చేస్తున్నాయి.

Vertical Gardens: వర్టికల్​ గార్డెన్స్​ లోని ప్రత్యేకతలు

నగర సుందరీకరణలో భాగంగా
సాధారణంగా నగరాల్లో ప్రధాన కూడళ్లలో, పార్కుల్లో పూలు, ఇతర మొక్కలను నేలపై పెంచుతాం. వాటికి నీరిందిస్తున్న క్రమంలో అవి వికసిస్తాయి. నేలపై కాకుండా నిలువుగా మొక్కలు పెంచటాన్నే వర్టికల్ గార్డెన్ అంటారు. ఈ విధానంలో చాలా రకాల పూల మొక్కలను జీహెచ్​ఎంసీ పెంచుతోంది. 2017లో నగర సుందరీకరణలో భాగంగా జీహెచ్​ఎంసీ దీన్ని ప్రారంభించింది. ప్రధాన ప్రాంతాల్లోని కూడళ్లతో పాటు పలు ఫ్లైఓవర్ల మీద వర్టికల్ గార్డెన్స్‌ను ఏర్పాటు చేసింది. మెటల్ ప్యానెల్‌లకు అమర్చబడిన నిలువు ప్లాట్‌ఫారమ్‌లో మొక్కలు పెంచుతారు. ఇది బాటసారులకు ఆహ్లాదంతో పాటు నగరానికి అదనపు అందాన్ని ఇస్తోంది.
ఇక్కడ చెట్లు(వర్టికల్​ గార్డెన్​ విధానంలో) పెట్టడం వల్ల చాలా చల్లదనం ఉంటుంది. డ్రైనేజీల నుంచి మురుగు వాసన రాకుండా ఉంటుంది. వ్యాపారం చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది. లొకేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. చూడటానికి అందంగా ఉండి అందరినీ ఆకర్షిస్తుంది. పార్కు లెక్క చాలా బాగుంది. బిజినెస్​ చేసుకునేందుకు కూడా చాలా బాగుంది. ఇలాంటివి వేరే చోట పెట్టినా బాగుంటుంది. చెట్లు ఉండటం వల్ల దుర్వాసన తక్కువైంది. చాలా అందంగా కనిపిస్తుంది అంటున్నారు స్థానికులు.
చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది
ఒక్కో కూడలి వద్ద వందల మొక్కలు నాటుతుంటారు. వీటి సంరక్షణను జీహెచ్​ఎంసీ సిబ్బంది చూసుకుంటుంది. సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు నీళ్లు పోయటం మధ్యలో ఏవైనా మొక్కలు ఎండిపోతే మళ్లీ కొత్తవి పెడుతుంటారు. వర్టికల్ గార్డెన్స్ వల్ల చూడటానికి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుందని దుర్వాసన రాకుండా కూడా ఉంటుందని స్థానిక ప్రజలు అంటున్నారు. నగరాన్ని పచ్చగా చేసేందుకు హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో వర్టికల్ గార్డెన్స్‌ను ఏర్పాటు చేశారు. వీటిని మరిన్ని కొన్ని చోట్ల పెడితే బాగుంటుందని ప్రజలు అంటున్నారు.

Read Also: Rajiv Yuva Vikasam: రాజీవ్​ యువవికాసం..నెలాఖరులో ఎంపిక

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Special features Telugu News online Telugu News Paper Telugu News Today vertical gardens

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.