Smitha Sabarwal : స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత ఘాటు వ్యాఖ్యలు

Read Time:  1 min
Smitha Sabarwal స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత ఘాటు వ్యాఖ్యలు
Smitha Sabarwal స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత ఘాటు వ్యాఖ్యలు
FONT SIZE
GET APP

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కి సంబంధించిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ విధానాలపై ఆమె చేసిన ఒక పోస్ట్, పెద్ద దుమారానికే దారి తీసింది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం తీవ్రంగా స్పందించారు.ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు ఎలా విమర్శలు చేస్తారు? అని ప్రశ్నించారు.ప్రభుత్వ జీతం తీసుకుంటూ, వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని ఆయన మండిపడ్డారు.“ఆమె ఐఏఎస్ అధికారిణి.ఏం యాక్షన్ చేస్తుందబ్బా? అంటూ ఆయన మాటల తూటాలు పేల్చారు. గచ్చిబౌలి భూముల అంశంపై ఆమె పెట్టిన పోస్ట్‌కు సంబంధించి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనికి కాంతం ఘాటుగా స్పందించారు.ఇప్పుడే నిజం గుర్తొచ్చిందా? పదేళ్లపాటు కేసీఆర్ పక్కనే ఉండినప్పుడు ప్రశ్నించలేదేంటి?” అని అన్నారు. గత ప్రభుత్వంలో ఆమె కీలక స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు.తెరాస పాలనలో అడవులు నాశనమయ్యాయి. 13 లక్షల చెట్లు నరికేశారు.

Smitha Sabarwal స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత ఘాటు వ్యాఖ్యలు
Smitha Sabarwal స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత ఘాటు వ్యాఖ్యలు

జింకలు, వన్యప్రాణులు పరారయ్యాయి.ఆ సమయంలో ఆమె మౌనంగా ఎందుకు ఉన్నారు? అని నిలదీశారు.ఇప్పుడు ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టే ధైర్యం వస్తుందేంటి?” అని తీవ్రంగా ప్రశ్నించారు.అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఆమెకు పదవిలో ఉన్నప్పుడు భయం ఉండిందా? అని కూడా అడిగారు.కేసీఆర్, కేటీఆర్‌లు హెలికాప్టర్లలో తిరిగినట్టు, ఆమె కూడా తిరిగారని విమర్శించారు.ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆమె ఎలా కలిసిపోయారు?” అని కాంతం వ్యాఖ్యానించారు.ఒక అధికారి తాను పనిచేస్తున్న ప్రభుత్వంపై ఇలా ఎలా మాట్లాడతారు? అంటూ మండిపడ్డారు.“ఇది అధికార పరిమితికి భంగం కాదా?” అని ప్రశ్నించారు.ఇంతటి ఘాటైన వ్యాఖ్యలపై అధికార వర్గాలు స్పందించాల్సిన అవసరం ఉంది.ప్రభుత్వ విధానాలను అధికారులే విమర్శిస్తే, ప్రజల నమ్మకం ఎటు పోతుందో అనేది ప్రశ్న.ఇప్పుడు ఈ వివాదం రాజకీయంగా పెద్ద దుమారానికే దారి తీస్తోంది.అధికార పార్టీల్లోనే కాకుండా ప్రతిపక్షాల్లోనూ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.ఐఏఎస్ అధికారిణి పాత్ర, ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రభుత్వ విధానాలపై ఆమె స్వేచ్ఛ గురించి ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కానీ, స్మితా స్పందన మాత్రం ఇంకా రాలేదు.ఇదే తరహా వ్యవహారాలు ప్రజాస్వామ్యంలో అధికారుల నైతిక బాధ్యతను గుర్తుచేస్తున్నాయి.ఇప్పుడు అందరి దృష్టి ఆమె తర్వాతి అడుగుపై ఉంది.

Read Also : Revanth Reddy : హైకోర్టు మెట్లెక్కిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి!

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.