📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Phone Tapping: ఫోన్ టాపింగ్ కేసులోమాజీ డిజిపిలు, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ విచారణకు సిట్

Author Icon By Vanipushpa
Updated: June 10, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో మొదటి ముద్దాయిగా వుండి 15 నెలల తరువాత సోమవారం నాడు విచారణకు హాజరైన ఐబి మాజీ బాస్ ప్రభాకర్ రావు(PrabhakarRao) ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఇద్దరు మాజీ డిజిపిల(Ex DGP)తో పాటు మరో ఇద్దరు పూర్వ నిఘా విభాగం అధిపతులను విచారించాలని భావిస్తున్నట్లు సమాచారం. తాను ఎస్ఐబి బాస్ గా పనిచేసిన సమయంలో తన పై అధికారుల ఆదేశాలు పాటించాను తప్పించి… సొంత నిర్ణయాలు తీసుకోలేదని ప్రభాకర్ రావు సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు ఎస్ఐబి బాస్ మొదట్లో డిఐజి క్యాడర్ లో వుండగా ఆ తరువాత ఐజి క్యాడర్కు పదోన్నతి పొంది అక్కడే పదవీ విరమణ చేసి ఓఎన్దిగా కూడా కొనసాగారు. గత ఏడాది డిసెంబర్ నాలుగవ తేదీన రాష్ట్ర అసెంబ్లీ ఎన్ని కల ఫలితాలు వచ్చాక అదే రోజు సాయంత్రం రాజీనామా చేశారు. ఆయన ఎస్ఐబి బాస్ పనిచేసిన సమయంలో నిఘా విభాగం అధిపతిగా మొదట్లో ఐజి క్యాడర్ అధికారి నవీ న్ చంద్ వుండేవారు. ఆయన పదవీ విరమ ణ తరువాత నాలుగైదు నెలల పాటు ప్రభాకర్ రావు ఓఎస్డిగా నిఘా విభాగం బాస్ కూడా కొనసాగారు. విశ్రాంత ఐజి స్థాయి అధికారిని నిఘా విభాగం బాస్ అప్పటి బిఆర్ఎస్ సర్కారు నియమించడం సంచలనం రేపింది.

Phone Tapping: ఫోన్ టాపింగ్ కేసులోమాజీ డిజిపిలు, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ విచారణకు సిట్

ప్రభాకర్ రావు తాజాగా ఇచ్చి వాంగ్మూలనం ఆధారంగా..

ఇటువంటి నియామకం దేశంలో ఏ రాష్ట్రంలో నూ జరగలేదని అధికారులు అప్పట్లో చె ప్పుకున్నారు. నిఘా విభాగం బాస్ గా నవీన్ చంద్ పదవీ విరమణ చేసే నాటికి నిఘా విభా గంలోనే మరో ఐజి స్థాయి అధికారి రాజేష్ కుమార్ వున్నప్పటికీ ఎస్ఐబి ఓఎస్డిగా వున్న ప్రభాకర్ రావును మొత్తం నిఘా విభాగానికి బాస్ గా చేయడం అప్పట్లో రాష్ట్ర పోలీసు శాఖలో సంచలనం రేపింది. అయితే ఆ తరువా త అనూహ్యంగా ప్రభుత్వం నిఘా విభాగానికి అనిల్ కుమార్ను బాస్ నియమించి ప్రభాకర్ రావును ఎస్ఐబికి పరిమితం చేసింది. ఇక ఎస్ఐబి బాస్ ప్రభా కర్ రావు పనిచేసిన సమయంలో డిజిపిగా | మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్లు పనిచేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు తాజాగా ఇచ్చి వాంగ్మూల ం ఆధారంగా నిఘా విభాగం బాస్ లుగా పనిచేసిన నవీన్ చంద్, అనిల్ కుమార్లతో పాటు డిజిపిలుగా పనిచేసిన మహేందర్ రెడ్డి, అంజనీ కుమా ర్లను విచా రించాలని సిట్ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ఒకటి త్వరలో ఈ నలుగురు అధికారులకు అధికారికంగా సమాచారం అందించే వీలుందని తెలిసింది.

Read Also: Phone Tapping Case : ముగిసిన ప్రభాకర్ రావు విచారణ

#telugu News Ap News in Telugu Breaking News in Telugu former intelligence chief Google News in Telugu in phone tapping case Latest News in Telugu Paper Telugu News SIT to probe former DGPs Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.