📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Singareni: సింగరేణి కార్మికులకు రూ.1.25 కోట్ల ప్రమాద బీమా

Author Icon By Vanipushpa
Updated: June 12, 2025 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పంజాబ్ బ్యాంక్ తో ఒప్పందం: సంస్థ సిఎండి బలరామ్

హైదరాబాద్: సింగరేణిISingareni) కార్మికులకు 1.25 కోట్ల రూపాయల ప్రమాద బీమా( Accidental Bheema)ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు దీనికి సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంకు(Punjab National Bank)తో బుధవారం సింగరేణి సంస్థ ఒప్పందం చేసుకుంది. దీన్ని పురస్కరించుకుని సింగరేణి సిఎండి ఎన్ బలరామ్(N.Balaram) వెల్లడించారు. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమన్నారు. ప్రమాదవ శాత్తు కార్మికులు మృతి చెందినప్పుడు కంపెనీ ఇస్తున్న సహాయం కొంత ఉన్నప్పటికీ వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో బ్యాంకులతో మాట్లాడి ఈ తరహా ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే అమల వుతున్న పథకాల వల్ల కార్మికుల కుటుంబాలకు గట్టి ఆర్థిక భరోసా లభించిందని అన్నారు.

Singareni: సింగరేణి కార్మికులకు రూ.1.25 కోట్ల ప్రమాద బీమా

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా మిగిలిన బ్యాంకుల అన్నిటికన్నా ఎక్కువగా కోటి 25 లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయడానికి ముందుకు రావడం, అలాగే సాధారణ మరణం సంభవించిన వారికి 10 లక్షల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ ను కూడా అమలు చేయనుం దని వివరించారు. ఇదే బ్యాంకు ద్వారా సింగరేణి పొరుగు సేవల ఉద్యోగుల కోసం 40 లక్షల రూపాయల ప్రమాద బీమా ఒప్పందాన్ని కూడా అమలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలను పెద్ద ఎత్తున చేపడుతోందని సోలార్ విద్యుత్తు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎలక్ట్రిసిటీ తదితర రంగాలలోకి ప్రవేశిస్తుందనీ, ఈ నేపథ్యంలో బ్యాంకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు పోతుందని పేర్కొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈవో అశోక్ చంద్ర మాట్లాడుతూ సింగరేణి సంస్థతో తాము కుదుర్చుకున్న ఈ ఒప్పందం ఇతరులకు కూడా ఆదర్శప్రాయమని అన్నారు. ఈ పథకం సింగరేణి ఉద్యోగులకు వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ తరహా ఒప్పందాలను ఇతర శాఖలకు కూడా విస్తరించనున్నమని తెలియజేశారు. సింగరేణి వ్యాపార విస్తరణ ప్రాజెక్ట్ లకు తమ తరఫున పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్.వి సూర్యనారాయణ, ఇడి ఎస్.డి.ఎం. సుభాని, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హైదరాబాద్ రీజినల్ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ చుగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Read Also: Thalliki Vandanam : జగన్ ‘తల్లికి వందనం’ ట్రోల్ వీడియోపై టీడీపీ సెటైరికల్ ట్వీట్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu get accident insurance Google News in Telugu Latest News in Telugu of Rs. 1.25 crore Paper Telugu News Singareni workers Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.