📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Seethakka: అక్టోబర్ 2 నుండి మహిళలకు పెట్రోల్ బంకులు..సీతక్క ఆదేశాలు

Author Icon By Anusha
Updated: June 10, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించిన సోలార్ ప్లాంట్లు , పెట్రోల్ బంకులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Seethakka) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం (జూన్ 9) సచివాలయం నుంచి ఆమె కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.22 జిల్లాల్లో చేపట్టిన ఇందిరా మహిళాశక్తి భవనాల నిర్మాణం నవంబర్ నాటికి పూర్తిచేయాలన్నారు. ‘ఇందిరా మహిళాశక్తి ఒక ప్రతిష్టాత్మక పథకం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ఈ పథకం లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేర్చడానికి కలెక్టర్లు కృషి చేయాలి. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం(Panchayat Raj Engineering Department) అధికారులతో సమన్వయం చేసుకుని ఇందిరా మహిళాశక్తి భవనాలను పూర్తిచేయాలి’ అని సీతక్క ఆదేశించారు.

వెయ్యి అంగన్‌వాడీ

మహిళా సంఘాలచే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలను కుట్టిస్తున్నామని, బడులు తెరిచే రోజున విద్యార్థులందరికీ వాటిని పంపిణీ చేస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాలు ఈ నెల 11న తెరుచుకోనున్నందున కలెక్టర్లు వాటిని పరిశీలించాలని సూచించారు. కొత్తగా వెయ్యి అంగన్‌వాడీ భవనాలను(Anganwadi buildings) నిర్మించబోతున్నామని వాటికి స్థలాలను సేకరించాలని ఆదేశించారు. ‘బాలభరోసా’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

చర్యలు తీసుకోవాలని

ఈ పథకం కింద ఐదేళ్ల లోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయిస్తామని,ఏవైనా శస్త్రచికిత్సలు అవసరమైతే ఉచితంగా చేయిస్తామని ఆమె తెలిపారు. అర్హులైన మహిళలందరూ ఎస్‌హెచ్‌జీ(SHG)ల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలు అందజేసేందుకు 38 ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, సకాలంలో వారికి అవి అందేలా చూడాలని సూచించారు. ఈ చర్యలన్నీ మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని చేపడుతున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.

Seethakka

వడ్డీకి రుణాలను

తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేస్తోంది. పలు పథకాలు, కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక, ఆరోగ్యపరమైన అభివృద్ధికి కృషి చేస్తోంది. SHGలకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలను అందించి, స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తోంది.

బంకులను కేటాయించి

మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు(Solar plants), పెట్రోల్ బంకులను కేటాయించి వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ఇందిరా మహిళాశక్తి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇవే కాకుండా మహాలక్ష్మి, గృహజ్యోతి, రూ.500కే సిలిండర్ వంటి పథకాలు అమలు చేస్తున్నారు.

Read Also: Telangana: టీజీ లో కొత్త మెనూ ఫుడ్..ఇక పై మాంసంతో పాటు గుడ్లు

# Seethakka #GreenEnergyInitiative #IndiraMahilaShakti #PetrolBunksForWomen #selfhelpgroups #SolarForWomen #SustainableDevelopment #TelanganaWomenEmpowerment #WomenPower Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.