📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

School: సర్కార్ బడుల్లో ఉచితంగా సాంకేతిక విద్య

Author Icon By Ramya
Updated: June 16, 2025 • 10:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ ఎన్జీవోలతో విద్యాశాఖ ఎంఒయు

Hyderabad: ప్రభుత్వ పాఠశాలల (School) విద్యార్థులకు అత్యాధునిక సాంకేతికబోధన సేవలను ఉచితం గా అందించాలన్న లక్ష్యంతో ప్రముఖ (NGO) సంస్థలతో విద్యాశాఖ (MoU) కుదుర్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆధు నాతన ఎడ్‌టెక్ సదుపాయాలను ప్రభుత్వం అందించనుంది. ఇందుకు నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్స్టెవ్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే అధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబార్ నిర్వహిస్తున్న పైజామ్ పౌండేషన్, సఫీనా హుస్సేన్ అధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో విద్యాశాఖ సిఎం రేవంత్ సమక్షంలో ఆదివారం ఎంఓయు కుదుర్చుకుంది.

కృత్రిమ మేథ ఆధారిత పరిష్కారాలకు ప్రాధాన్యం

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర విద్యా రంగంలో విప్ల వాత్మక మార్పులు తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో విద్యానాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలన్న సిఎం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలకు ఆకర్షితులై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు వస్తున్న వివిధ సంస్థలు. నందన్ నీలేకణి నేతృత్వం లోని ఎక్స్టెప్ ఫౌండేషన్ కృత్రిమ మేథ ఆధారిత ప్లాట్ ఫారమ్ 540 పాఠశాలలలో పని చేస్తుంది. ఇకపై 33 జిల్లాల పరిధిలో 5,000కి పైగా ప్రాథమిక పాఠశాలల (School) కు విస్తరించనుంది.

మూడో తరగతి నుంచి 5వ తరగతి వరకు బేసిక్ భాషలు, గణితం శిక్షణ

మూడో తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ భాషలతో పాటు మ్యాథ్స్ బేసిక్స్ ను ఈ సంస్థ అందిస్తుంది. ఫిజిక్స్ వాలా ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు సన్నద్ధులను చేస్తుంది. ఖాన్ అకాడమీ రాష్ట్రంలో 6వ తరగతి నుంచి పదోతరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అను గుణంగా వీడియో ఆధారిత స్టెమ్ (Science, Technology, Engineering, Maths) శిక్షణను అందజేస్తుంది. డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలో ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి క్లాస్ 12 వరకు విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. పై జామ్ ఫౌండే షన్ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్పై శిక్షణను అందిస్తుంది.

పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా బాలికలు తిరిగి బడికి

ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్చిం చటంతో పాటు, బాలికల అక్షరాస్యత, విద్యా అవకాశాలను మెరుగు పరుస్తుంది. ఈ కార్యక్ర మంలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ హరిత, ఎక్ స్టెప్ ఫౌండేషన్ సీఈవో జగదీష్ బాబు, ప్రజ్వల ఫౌండేషన్ చీఫ్ డా. సునీతా కృష్ణన్, ఫిజిక్స్ వాలా కోఫౌండర్ ప్రతీక్ మహే శ్వరి, ఖాన్ అకాడమీ ఇండియా ఎండీ స్వాతి వాసుదేవన్, పైజామ్ పౌండేషన్ ఫౌండర్ షోయబ్ దార్, ఎడ్యుకేట్ గర్ల్స్ సిఈవో గాయత్రి నాయిర్ లోబో, తదితరులు పాల్గొన్నారు.

Read also: Indiramma Houses : అనర్హులకు ఇళ్లు వస్తే రద్దు చేస్తాం- పొంగులేటి

#AIinEducation #CodingForKids #DigitalEducation #EdTechForAll #EducateGirls #EducationReform #EkStepFoundation #FreeDigitalLearning #FutureReadyStudents #GirlsEducation #KhanAcademy #MOUSign #PhysicsWala #PiJamFoundation #PragyaFoundation #PublicPrivatePartnership #PublicSchools #SchoolTransformation #STEMLearning #TechInSchools #TechnologyEducation #TelanganaVidya Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.