📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Ramchandar: రాంచందర్ రావుకు MLC కవిత కీలక సలహాలు

Author Icon By Anusha
Updated: July 3, 2025 • 2:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ బీజేపీని బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం, ఒత్తిడికి గురిచేస్తూ, తన పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్‌లో తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆమె, జూలై 17న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే ‘ రైల్ రోకో ‘ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీసీల హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమంలో కొత్త దశకు అడుగుపెడుతున్నట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లు (BC Reservation Bill) కేంద్రం అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండగా, కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.అంశంపై ఇప్పటికే తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రాంచందర్ రావుకు లేఖ రాసినట్లు తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని

ఆయన చొరవ తీసుకొని బీజేపీ అధ్యక్ష హోదాలో తొలి విజయం సాధించాలని సూచించారు.ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ స్పందించలేదని ఆమె విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు బీసీల కోసం పార్లమెంట్‌లో ఎన్నడూ మాట్లాడలేదని కవిత విమర్శించారు. మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా బీజేపీపైనా ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ మేరకు తాను ఖర్గేకు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు.కులగణన వివరాలు బయట పెట్టాలని తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం పాత లెక్కలే చెబుతున్నారని కవిత ఆరోపించారు. 

Ramchandar: రాంచందర్ రావుకు MLC కవిత కీలక సలహాలు

కులగణన వివరాలు

గ్రామ పంచాయతీల వారీగా కులగణన వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి కనబరుస్తోందని కవిత ఆరోపించారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని గుర్తు చేశారు. ఇకనైనా రేవంత్ రెడ్డి (Revanth Reddy) బనకచర్లను ఆపేందుకు గట్టిగా కొట్లాడాలని కవిత సూచించారు. ఇక రైల్ రోకో కార్యక్రమానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు తనది బీఆర్ఎస్ పార్టీనేనని, రైల్ రోకోకు బీఆర్ఎస్ సపోర్ట్ ఉంటుందని చెప్పారు. అనంతరం రైల్ రోకో పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.

Read Also: Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం..వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య

#BCReservationBill #KavithaProtest #RailRoko #TelanganaPolitics #BRSMovement #BCRights #TelanganaJagruthi #ReservationDemand #BJPResponsibility #KavithaVoice Ap News in Telugu BC Reservation Bill BC rights demand Breaking News in Telugu BRS MLC Kavitha Delhi protest plan Google News in Telugu Hyderabad press meet July 17 protest Kavitha BC Bill protest Kavitha demands BJP support Latest News in Telugu letter to Ramchander Rao Paper Telugu News political agitation Telangana Rail Roko Telangana reservation movement telangana bjp president Telangana Jagruthi Rail Roko Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.