Ramachander Rao Arrest: రాంచందర్‌రావు అరెస్ట్.. స్పందించిన కిషన్ రెడ్డి

Read Time:  1 min
Ramachander Rao Arrest: రాంచందర్‌రావు అరెస్ట్.. స్పందించిన కిషన్ రెడ్డి
FONT SIZE
GET APP
Ramachander Rao's arrest.. Kishan Reddy responds
Ramachander Rao’s arrest.. Kishan Reddy responds

Ramachander Rao Arrest: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్తత దృష్ట్యా కామారెడ్డికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి లేదని చెప్పారు. తాము కామారెడ్డికి వెళ్లి తీరుతామని రాంచందర్‌రావు ప్రకటించారు. ఈ క్రమంలో రాచందర్‌రావు ఇంటికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రాంచదర్‌రావును అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Hyderabad kidnap drama : ప్రియురాలి కోసం కిడ్నాప్ డ్రామా, భర్త అసలు ప్లాన్ బహిర్గతం
కామారెడ్డి జిల్లా  బాన్సువాడలో రెండు వర్గాల మధ్య ఇటీవల ఘర్షణ జరిగిన నేపథ్యంలో అక్కడకు వెళ్లేందుకు రామచందర్ రావు సిద్ధమయ్యారు. అదే సమయంలో కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ వారు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ అక్కడకు కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఉదయం నుంచి రామచందర్ రావును గృహ నిర్బంధం చేసిన పోలీసులు, ఆ తర్వాత అరెస్టు చేశారు.

రామచందర్ రావు అరెస్టును ఖండించిన కిషన్ రెడ్డి

రామచందర్ రావు అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. బాన్సువాడ, కామారెడ్డిలకు ఆయన వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమని అన్నారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగిందని, ఇది ఆందోళనకరమని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డిలో గెలిచినందుకు కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడటం సరికాదని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.