తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురిసే సూచనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. జూన్ 10, 11, 12 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తాజా నివేదికలో పేర్కొంది. ద్రోణుల ప్రభావంతో ఏర్పడిన వాతావరణ పరిస్థితులు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలకు దారితీయనున్నాయని వెల్లడించింది.మరీ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow alert) జారీ చేయగా గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
భారీ వర్షాలు
వాతావరణ శాఖ, జూన్ 10వ తేదీన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డితో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.జూన్ 11వ తేదీ బుధవారం రోజున జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచనలు చేసింది.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జూన్ 12వ తేదీ గురువారం రోజున పాటు వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) తెలిపింది.
వాతావరణ శాఖ
ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు కురిసే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు చేసింది. రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు హితవు పలికారు.అంతేకాకుండా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద ఉండరాదని తెలిపింది. భారీ వర్షాల హెచ్చరికల వేళ, అత్యవసరం అయితే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు.
Read Also: Seethakka: సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే సంక్షేమ పథకాలు: మంత్రి సీతక్క