తెలంగాణకి వాతావరణ శాఖ అధికారులు తాజా రెయిన్ అలర్ట్‌ను జారీ చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు. ఈదురు గాలులు సైతం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
అవకాశం
నైరుతి రుతుపవనాల విస్తరణ కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా, అదే సమయంలో పలు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసిన మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు(Temperatures) పెరుగుతాయని అంటున్నారు. పగటి పూట 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నెల 5వ తేదీ వరకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తీవ్రమైన ఎండ, ఉక్కపోత కూడా ఉంటుందని చెబుతున్నారు.
అధికారులు
ఈ ఏడిదా నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుగానే తాకాయి. సాధారణంగా జూన్ 10న రాష్ట్రంలోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు దాదాపు 17 రోజుల ముందుగానే రాష్ట్రాన్ని తాకాయి. తెలంగాణలోని దక్షిణ జిల్లాలైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District)ను మే 27న నైరుతి రుతుపవనాలు తాకడంతో రాష్ట్రంలోకి రుతుపవనాల ప్రవేశాన్ని అధికారికంగా అధికారులు ప్రకటించారు. గతంలో 2008, 2009 సంవత్సరాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఏర్పడి రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. ముందస్తు రుతుపవనాల ప్రవేశం రాష్ట్రంలోని వ్యవసాయ రంగంపై సానుకూల ప్రభావం చూపవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ(Department of Meteorology) అంచనాల ప్రకారం, రాబోయే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురు గాలులు మాత్రమే ఉంటాయని, భారీ వర్షాలకు అవకాశం లేదని గమనించాలి. జూన్ 5వ తేదీ వరకు పగటి ఉష్ణోగ్రతలు 36 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
Read Also: Mulugu : ములుగులో ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు