Praja Viswasam Bill: రాష్ట్రంలో వ్యాపార సమర్థతను పెంచడంతో పాటు సులభతర వాణిజ్యాన్ని (Ease of Doing Business) మరింత ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీధర్ బాబు ‘తెలంగాణ ప్రజా విశ్వాసం చట్టం బిల్లు’ (Telangana Praja Viswasam Bill) ను శాసనసభలో ప్రవేశపెట్టారు.
Read Also :Fee Reimbursement : విద్యార్థుల రీయింబర్స్మెంట్ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Praja Viswasam Bill: బిల్లు ప్రధాన ఉద్దేశాలు & ప్రయోజనాలు

వివిధ వ్యాపార సంబంధిత చట్టాల్లోని చిన్న చిన్న, సాంకేతిక ఉల్లంఘనలను (Minor and Technical Offences) నేరపూరిత పరిధి నుంచి తొలగించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు చిన్నపాటి సాంకేతిక లోపాలకే జైలు శిక్ష లేదా సుదీర్ఘ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే భయం లేకుండా స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ చట్టం తోడ్పడుతుంది. అనవసరమైన కేసలు, రెడ్ టేపిజంకు స్వస్తి పలుకుతూ ప్రభుత్వ పాలనలో పారదర్శకతను మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం అమలులోకి రావడం ద్వారా కొత్త పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా, రాష్ట్రంలో సులభతర వాణిజ్య వాతావరణం మరింత పటిష్టమవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :