हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Ponnam Prabhakar: TGSRTCలో కొత్త నియామకాలు చేపడతాం..

Anusha
Ponnam Prabhakar: TGSRTCలో కొత్త నియామకాలు చేపడతాం..

తెలంగాణలో ఇటీవల ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ప్రజలతో పాటు ఆర్టీసీకి కూడా కొత్త శక్తిని నూరిపోస్తోంది, అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ప్రజా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మంత్రి సీతక్కతో కలిసి 151 మండల మహిళా సంఘాల గ్రూప్‌లకు (అద్దె బస్సుల యజమానులకు) రూ.1.05 కోట్ల చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలోని మహిళలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇది మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం వేస్తున్న కీలక అడుగు అని చెప్పారు.చేతి గుర్తుకు ఓటేసినందుకు మహిళలు చెయ్యెత్తితే చాలు ఆర్టీసీ బస్సు ఆపుతున్నారని అన్నారు. తాము సగౌరవంగా బస్సెక్కుతున్నామని మహిళలు చెబుతున్నారని పొన్నం గుర్తుచేశారు. 

మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిన రికార్డు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని, ఈ పథకం వల్ల ఆర్టీసీ మరోసారి బతికిందని పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే దాదాపు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిన రికార్డు నమోదు కాబోతుందని తెలిపారు. ఇప్పటివరకు రూ.6500 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం నమోదైందని, ఈ డబ్బులు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని స్పష్టం చేశారు.మహాలక్ష్మి పథకం విజయవంతం కావడం కోసం డ్రైవర్లు, కండక్టర్లు ఎంతో కష్టపడుతున్నారని వారి సేవలను కొనియాడారు. 

Ponnam Prabhakar: TGSRTCలో కొత్త నియామకాలు చేపడతాం..
Ponnam Prabhakar: TGSRTCలో కొత్త నియామకాలు చేపడతాం..

మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ ఉచిత బస్సులను

మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల బాట పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని కొత్త నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ ఉచిత బస్సు (RTC free bus) లను వాడుకుంటున్నారని, ఇది ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచుతుందని అన్నారు. ఈ అంశంపై తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన సంబరాలు నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ పథకం కేవలం ఉచిత ప్రయాణం మాత్రమే కాదని, మహిళల స్వేచ్ఛకు, ఆర్థిక భద్రతకు ఒక చిహ్నంగా మారిందని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Telangana: అంగన్​వాడీ కేంద్రాల్లో ఇకపై నోరూరించే కొత్త వెరైటీలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870