📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Nutrition Scheme: బాలికలు బలమైన పోషకాహారం పథకం నేటి నుండి అమలు

Author Icon By Anusha
Updated: May 29, 2025 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కౌమార దశలో ఉన్న బాలికల ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని కీలకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి ‘ఇందిరమ్మ అమృతం’ అనే పేరును పెట్టింది.నేడు(గురువారం) ఈ పథకం ప్రారంభించనుంది. టీనేజ్ బాలికల కోసం ఈ పథకం తీసుకువస్తోంది. రాష్ట్రంలో మహిళలు, బాలికల్లో చాల మంది రక్త హీనత(Anemia) సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వారికి మెరుగైన పోషకాహారం అందించేందుకు తెలంగాణ మహిళా, శిశు సంక్షేమశాఖ చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా 14-18 ఏళ్ల బాలికలకు బలమైన పోషకాహారం అందించేందుకు సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది.పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ‘ఆడపిల్లలకు శక్తినిద్దాం,ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం’ అనే నినాదంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. దీని ద్వారా కౌమార బాలికలకు పల్లి, చిరుధాన్యాలతో తయారు చేసిన చిక్కీలను ఇవ్వనున్నారు. ప్రతి నెల అంగన్వాడీ కేంద్రాల(Anganwadi centers) ద్వారా వీటిని ఉచింతగా పంపిణీ చేయనున్నారు.

Nutrition Scheme: బాలికలు బలమైన పోషకాహారం పథకం నేటి నుండి అమలు

పథకాన్ని

ఒక్కో బాలికకు రోజుకు ఒకటి చొప్పున నెల మొత్తం సరిపోయేలా 30 చిక్కీలను అందిస్తారు. ఒక్కో దాంట్లో సుమారు 600 కేలరీలు, 18-20 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. రెండు సార్లు వీటిని పంపిణీ చేస్తారు. పదిహేను చిక్కీల చొప్పున, నెలకు రెండు సార్లు అంగన్వాడీ కేంద్రాల ద్వారా కౌమార బాలికలకు ‘ఇందిరమ్మ అమృతం'(Indiramma Amrutham) కిట్లను అందజేయన్నారు. అలానే బాలికల ఆరోగ్య స్థితిని అంచనా వేసేందుకు గాను త్వరలోనే ఆరోగ్యశాఖ హెచ్‌బీ పరీక్షలు నిర్వహించనుంది. ఈ సమస్య ఉన్న బాలికలను గుర్తించి వారికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను అందిస్తారు.తొలుత పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొమరం భీం అసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం,జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను ఈప్రాజెక్ట్ అమలు కోసం ప్రభుత్వం ఎంపిక చేసుకుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం, రాష్ట్రంలో 64.7 శాతం కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం దీనికి పరిష్కారంగా ఇందిరమ్మ అమృతం పథకాన్ని తీసుకురానుంది. దీనిలో భాగంగా అంగన్వాడీల ద్వారా 14-18 ఏళ్ల మధ్య వయస్సున్న కౌమార బాలికలకు పోషకాహారంగా పల్లి, చిరుధాన్యాలతో తయారైన చిక్కీలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

Read Also : Fly Over: హెచ్ సిటీలో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం

#AdolescentHealth #FightAnemia #HealthForGirls #IndirammaAmrutham #TelanganaGovernment Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.