National Science Day 2026: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఎడ్యుకేషనల్ మోడల్ రాకెట్ ప్రయోగానికి ఓరుగల్లు వేదిక అయ్యింది. వరంగల్ నగరంలోని భద్రకాళి చెరువులో రుద్రమ వి.0.1 అనే మోడల్ రాకెట్ ప్రయోగం జరుగబోతోంది. ఈ తరహా ప్రయోగం రాష్ట్రంలో ఇదే మొదటి సారి కావడం గమనార్హం.. వరంగల్కు చెందిన యువ శాస్త్రవేత్త ఏటిడిఆర్ ఎల్ వ్యవస్థాపకుడు, ఇస్రో రిజిస్టర్డ్ స్పేస్ ట్యూట ర్డ్ శశాంక్ భూపతి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 5 గంటలకు ఈ మోడల్ రాకెట్ ప్రయోగం జరుగబోతోంది.
Read Also: Telangana: అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసిన మల్లు భట్టివిక్రమార్క

రుద్రమదేవి వీరత్వానికి ప్రతీకగా
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) సహకారంతో ఏటిడిఆర్ఎల్, ఎన్ఐటీ వరంగల్ ఆధ్వర్యంలో ఎక్స్ ప్లోరా 2026 పేరిట ఈ మోడల్ రాకెట్ లాంచ్ చేయబోతున్నారు. భద్రకాళి బండ్ వద్ద రాకెట్కు కావాల్సిన పూర్తి ఏర్పాట్లు చేశారు. కాగా ఎక్స్ ప్లోరా 2026 పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఈ నెల 18 నుంచి 27 వరకు ఔత్సహికులకు టెలిస్కోప్ ద్వారా గ్రహాలను వీక్షించే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. రాణి రుద్రమదేవి వీరత్వానికి ప్రతీకగా నేడు ఆమె పేరుతో రుద్రమ వి.01 రాకెట్గా నిర్వాహకులు నామకరణం చేశారు.
ఇస్రో రిజిస్టర్డ్ స్పేస్ ట్యూటర్డ్ శశాంక్ భూపతి ఆలోచనలను కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్ పాయ్ దృష్టికి తీసుకెళ్ళడంతో ఈ ప్రయోగం అంకురార్పణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగానికి అవసరమైన నిధులను కుడా వెచ్చిస్తుండటం గమనార్హం. కాళోజి కళా క్షేత్రంలో నేడు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు సమావేశం నిర్వహించనున్నారు. దీనిపై పలువురు శాస్త్రవేత్తలు ప్రసంగించను న్నారు. ఆనంతరం సాయంత్రం 5:30 గంటలకు భద్రకాళి బండ్ నుంచి రాకెట్ లాంచ్ చేయనున్నారు.
4 అడుగుల పొడవు, తేలికపాటి (దాదాపు 500 గ్రాములు) బరువు ఉంటుందని తెలుస్తోంది. భూమి నుంచి సుమారు 3వేల అడుగుల వరకు నింగిలోకి దూసుకెళ్లి, ప్యారాచూ ట్ సహాయంతో సురక్షితంగా తిరిగి దిగుతుంది. స్పేస్ ఎడ్యుకేషన్పై విద్యార్థులకు అవగాహన కల్పించడం, భవిష్యత్లో ఆసక్తి పెరిగేలా చేయడమే రుద్రమ వీ. 01 రాకెట్ ప్రయోగం ముఖ్యఉద్దేశ్యం అని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: