Bomb threat to Nampally CBI Court: హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు ప్రాంగణంలో శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీబీఐ కోర్టుకు గుర్తుతెలియని దుండగుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కోర్టు ఆవరణలో బాంబు అమర్చామని, అది కాసేపట్లో పేలబోతోందని ఆ మెయిల్‌లో పేర్కొనడంతో సిబ్బంది హుటాహుటిన పోలీసులకు,అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. అధికారులు కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులను, అప్రమత్తం చేసి బయటకు పంపారు. బాంబు, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Read Also: Telangana: విద్యుత్ సంస్థలో అవినీతి ఆరోపణలపై ఇంజినీర్ల సస్పెన్షన్
తీవ్ర ఆందోళన
మరో వైపు ఫిబ్రవరి 18వ తేదీ తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి, కరీంనగర్, రాజమహేంద్రవరం, అనంతపురం కోర్టులకు ఈ బెదిరింపులు వచ్చాయి. దాంతో ఆయా కోర్టుల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడ ఎటువంటి బాంబు ఆచూకీ లభ్యం కాలేదు.

ఇవి నకిలీ బెదిరింపులుగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయినే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతలోనే కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ బెదిరింపు ఫోన్ కాల్ రావడంపై కోర్టులో న్యాయవాదులు,తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: