📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

MLC Kavitha: చిరంజీవిపై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

Author Icon By Anusha
Updated: July 5, 2025 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కల్వకుంట్ల కవిత పేరు తెరపైకి వచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె అయిన కవిత ఇటీవల లేఖల లీక్, సంచలనాత్మక వ్యాఖ్యలు, “తెలంగాణ జాగృతి”ను మళ్లీ యాక్టివ్ చేయడం వంటి పరిణామాలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ఇటీవల ఓ ప్రముఖ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత రాజకీయ వేడి పెంచాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో జైలుకు వెళ్లటం, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదన, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం వంటి వాటిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.కేసీఆర్‌పై కోపంతోనే తనను బీజేపీ సర్కార్ జైల్లో పెట్టిందన్నారు. తనను భయటకు తీసుకొచ్చేందుకు ఒకానొక దశలో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని అన్నారు. 

సీరియస్‌నెస్ ఉంటేనే రావాలని కమిట్‌మెంట్‌తో పని చేయాలని

అయితే ఆ సమయంలో తానే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. పార్టీనే నమ్ముకొని చాలా మంది కార్యకర్తలు, నాయకులు ఉంటారని వారికి అన్యాయం చేయటం సరికాదని చెప్పినట్లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పార్టీ పెట్టి ఆ తర్వాత తీసుకున్న యూటర్న్‌తో కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. రాజకీయాల్లోకి సీరియస్‌నెస్ ఉంటేనే రావాలని కమిట్‌మెంట్‌తో పని చేయాలని చెప్పారు.కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో నన్ను జైల్లో పెట్టారు. నా వల్లే జైల్లో ఉందని భావించి కేసీఆర్ గారు నన్ను భయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేయాలనే ప్రతిపాదన తెచ్చారు. దీంతో మా ఆయన్ను కేసీఆర్ గారి దగ్గరకు పంపాను. లేదు నేను జైల్లోనే ఉంటాను, నా కోసం మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పాను. పార్టీని మెర్జ్ చేయవద్దని మా ఆయనతో చెప్పించాను. 

నాయకులు చాలా సీరియస్‌గా గ్రామస్థాయిలో నిలబడతారు

నాన్న ఒకరి ముందు తలవంచడం కరెక్ట్ కాదనిపించింది. లక్షలాది మంది కార్యకర్తలు రోడ్డున పడతారు. చిరంజీవి గారు పార్టీ పెట్టి తీసేసినప్పుడు కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పాలిటిక్స్‌లో అలాంటి గేమ్స్ ఆడొద్దు. సీరియస్‌నెస్ ఉంటేనే పాలిటిక్స్‌లోకి రావాలి. ఎందుకంటే కార్యకర్తలు, నాయకులు చాలా సీరియస్‌గా గ్రామస్థాయిలో నిలబడతారు. అన్నీ ఫేస్ చేస్తూ మనకోసం వాళ్లు నిలబడతారు. పార్టీల కోసం ఆస్తులు, ప్రాణాలు కూడా పొగొట్టుకుంటారు. నేను నిజామాబాద్ ఎంపీ (Nizamabad MP) గా పోటీ చేసి ఓడిపోతే ఓ అబ్బాయి గుండెపోటుతో చనిపోయాడు. పాలిటిక్స్ ఇంత సీరియస్‌గా ఉంటాయి కాబట్టే, పార్టీని బీజేపీలో కలపాల్సిన పనిలేదు. నేను ఇంకో సంవత్సరం అయినా జైల్లోనే ఉంటానని కేసీఆర్ గారికి చెప్పాను.’ అని కవిత వెల్లడించారు.

MLC Kavitha: చిరంజీవిపై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ రాజకీయాల్లో

అంతేకాకుండా, “కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి” అనే వ్యాఖ్యకు కూడా రాజకీయ ప్రాధాన్యత ఉంది. ఇది తండ్రి కేసీఆర్ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నవారిపై ఆమెకి ఉన్న అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తపరుస్తోంది.ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకునే అవకాశం ఉందని, కవిత (Kavitha) పాత్ర మరోసారి ముఖ్యమవుతుందన్న అంచనాలు రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చనీయాంశంగా మారుతున్నాయి.

పార్టీ స్థాపించిన దాదాపు 30 నెలల తర్వాత

తెలుగు సినిమాల్లో మెగాస్టార్‌గా ఉన్న చిరంజీవి 2008లో రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఆ కాలంలో అత్యంత సంచలనంగా మారింది. ఆగస్టు 26న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించి, ‘‘ప్రజారాజ్యం పార్టీ’’ (Praja Rajyam Party) ని స్థాపించారు. ప్రజల సేవ కోసం రాజకీయాల్లోకి వస్తున్నానని, సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తానని అప్పట్లో చిరంజీవి ప్రకటించారు. మెగా అభిమానులకే కాదు, సమాజంలో మార్పు కోరే యువతకూ ఇది కొత్త ఆశలు కలిగించింది. 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసింది. 294 స్థానాలకు గాను 18 స్థానాలను గెలుచుకుని, మొత్తం ఓట్లలో దాదాపు 17 శాతం వాటాను దక్కించుకుంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, మారిన రాజకీయ పరిణామాలతో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన దాదాపు 30 నెలల తర్వాత అంటే 2011 ఫిబ్రవరి 6న పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఆయన్ను రాజ్యసభకు పంపి కేంద్రమంత్రిని చేసింది. 2014 నుంచి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ, సెకండ్ ఇన్నింగ్స్‌లో మళ్లీ సినిమాలు తీస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: AP Rains: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

#BRS #BRSMLC #BRSvsBJP #CongressMerger #KalvakuntlaKavitha #KavithaInterview #KavithaStatements #KCR #LeakedLetter #LiquorScam #PoliticalControversy #PrajaRajyam #TelanganaJagruthi #TelanganaNews #TelanganaPolitics #TRSNews Ap News in Telugu BJP-BRS merger proposal Breaking News in Telugu BRS leader comments brs mlc Chiranjeevi Praja Rajyam Congress merger Delhi liquor scam Google News in Telugu Kalvakuntla Kavitha Kavitha interview KCR daughter KCR inner circle Latest News in Telugu leaked letter Paper Telugu News political controversies sensational statements telangana jagruthi Telangana news Telangana politics Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.