మిస్ వరల్డ్ -2025 లో ఊహించని మలుపు: బ్రిటిష్ కంటెస్టెంట్ తప్పుకోవడం, యువతి వ్యాఖ్యలతో పెరిగిన వివాదం
ప్రపంచ ప్రఖ్యాత మిస్ వరల్డ్ -2025 పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. పాక్‌తో యుద్ధ భయాలు, అంతర్జాతీయ రాజకీయ అస్థిరతల మధ్య కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ను గ్లోబల్ బ్రాండ్ (Hyderabad global brand) గా తీర్చిదిద్దేందుకు, ప్రపంచ దృష్టిని ఈ నగరంపై కేంద్రీకరించేందుకు ఇదొక గొప్ప అవకాశంగా ప్రభుత్వం భావిస్తోంది. కానీ, ఈ అందాల పోటీ చివరి దశకు వచ్చేసిన ఈ సమయంలో ఊహించని విధంగా తీవ్ర వివాదాలు తెరపైకి వచ్చాయి.
మిస్ వరల్డ్ పోటీ నుంచి మిల్లా మాగీ తప్పుకోవడం – అసలు కారణం ఏమిటి?
బ్రిటన్‌కు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్ మిల్లా మాగీ పోటీ నుంచి తప్పుకున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో తనని వేశ్యలాగా చూస్తున్నారని చెప్పి ఆమె ఈ పోటీల నుంచి తప్పుకున్నారు. ఈ వివాదం ముగియక ముందే ఓ యువతి అసలు మిస్ వరల్డ్ పోటీల్లో ఏం జరుగుతుందో చెప్పిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ అందాల పోటీల వెనుక ఉన్న చీకటి కోణాలను ఓ యువతి ఇటీవల వెల్లడించింది.
చూపించే పోటీ ఒకటి.. లోపల జరిగేది మరోటి: యువతి సంచలన వ్యాఖ్యలు
ఈ పోటీలలో పైకి కనిపించేదానికి, లోపల జరిగే దానికి చాలా తేడా ఉంటుందని ఆమె వివరించింది. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ అందాల పోటీల వెనుక ఉన్న చీకటి కోణాలను ఓ యువతి ఇటీవల వెల్లడించింది. ఈ పోటీలలో పైకి కనిపించేదానికి, లోపల జరిగే దానికి చాలా తేడా ఉంటుందని ఆమె వివరించింది. ఆ యువతి చెప్పిన దాని ప్రకారం, మిస్ వరల్డ్ పోటీల ఫ్రాంచైజీ (Miss World pageant franchise) దక్కినప్పుడే అసలు ఆట మొదలవుతుందట. పోటీదారులను ఆహ్వానించి, ఒక నిర్దిష్ట అర్హత ప్రమాణాన్నిసెట్ చేస్తారు. అది దాటిన వారు పోటీకి అర్హత సాధిస్తారు. ఆ తర్వాత, ఈ అందగత్తెలు కొన్ని బ్రాండ్లను సంప్రదించి, అవి అంగీకరిస్తే, ఆ బ్రాండ్లే వారి ఖర్చులను భరిస్తాయి. ఇదంతా పైకి కనిపించే విషయమే.
“కిరీటం దక్కాలంటే పడుకోవాలి..” – సమాజాన్ని కలిచివేసిన వ్యాఖ్యలు
“కిరీటం దక్కాలంటే పడుకోవాలి.. టైటిల్ కావాలంటే కన్సిడర్ చేయాలి…” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదే వాస్తవం (రియాలిటీ) అని ఆమె నొక్కి చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. అయితే ఈ యువతి చేసిన ఆరోపణలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె మాటలను సమర్థిస్తూ, అందాల పోటీలలో ఇలాంటి చీకటి కోణాలు ఉంటాయని తాము కూడా విన్నామని చెబుతున్నారు. మరికొందరు మాత్రం, “ఇదంతా ఓ లూజర్ చెప్పే మాట” అంటూ ఆమె వాదనను కొట్టిపారేస్తున్నారు. ఓడిపోయిన వారు తమ నిరాశను ఇలా బయటపెడతారని విమర్శిస్తున్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు అందాల పోటీల పారదర్శకతపై మరోసారి చర్చకు దారితీశాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
పోటీల ప్రకాశవంతమైన ముఖానికి వెనక ఉన్న చీకటి వాస్తవం?
వాస్తవంగా చూసుకుంటే, ఈ పోటీలు ప్రపంచానికి గ్లామర్, అభివృద్ధి, మహిళల శక్తి అని చూపించే వేదికలు. కానీ, ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఆరోపణలు మాత్రం ఆ ప్రతిష్టను బలహీనపరుస్తున్నాయి. ప్రతి కంటెస్టెంట్ లక్షల మందికి ఆదర్శంగా నిలవాల్సిన సమయంలో, ఈ ఆరోపణలు సంఘాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మిస్స్ వరల్డ్ పోటీలు గౌరవనీయమైనవే అయినా, వాటిపై ఉన్న ఆరోపణలు, విమర్శలు పరిశీలనకు లోనవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
read also: Miss World 2025 : ఫైనల్స్‌కు ఎంపికైన మోడల్స్ వీళ్లే