Medak District Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో ఎదురొడ్డుతున్న అధికార పార్టీ

Read Time:  1 min
Medak District Municipal Elections
Medak District Municipal Elections
FONT SIZE
GET APP

కాంగ్రెస్‌కు తప్పని ఎదురీత.. ప్రతిపక్షాల గట్టి పోటీ!

Medak District Municipal Elections: అధికార కాంగ్రెస్ పార్టీ కి మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఎదురీత తప్పడం లేదు. సాధారణంగా అధికార పార్టీ కి స్థానిక ఎన్నికల్లో పెద్దగా పోటీ ఉండదు కానీ ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం పార్టీ అయిన బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తోంది. జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీలో కనీసం ఒక్క చైర్మన్ స్థానాన్ని అయినా కైవసం చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు.

Medak District Municipal Elections: మెదక్ మున్సిపాలిటీలో గట్టి పోటీ

జిల్లా కేంద్రం అయిన మెదక్ మున్సిపల్ లో 32 వార్డ్ లు ఉండగా ఒక వార్డ్ ఏకగ్రీవం కావడంతో 31 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్న అధికార పార్టీ నేతలకు ఎదురీత తప్పడం లేదు. కొందరు టికెట్ ఆశించి అప్పుడే పార్టీ లో చేరడం మరి కొంత మంది ఆ వార్డుల్లో స్థానికేతరులు కావడం తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కొంత మంది ముఖ్య నేతలు పార్టీ మారడం వారు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ తరపున బరిలో ఉండటంతో అధికార పార్టీకి తలనొప్పిగా మారింది.

రాజకీయ వ్యూహాలు – హరీష్ రావు విమర్శలు

మెదక్ మున్సిపల్ లో నామినేషన్ ల(Medak District Municipal Elections) ఉపసంహరణ సమయం వరకు ప్రతిపక్షాల అభ్యర్థులను బరిలో ఉండకుండా చూసేందుకు శతవిధాలా ప్రయత్నించారు తమ అభ్యర్థులను అధికార పార్టీ నేతలకు చిక్కకుండా చేశారు అంటే పోటి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. బుధవారం మెదక్ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు గెలిచే దమ్ము లేక మా అభ్యర్థులను బెదిరిస్తున్నారు అని చేసిన వ్యాఖ్యలు పట్టణం లో దుమారం రేపాయి.

Read Also: Medak Municipal Election: కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి

Medak District Municipal Elections: రామాయంపేటలో తప్పని ఎదురీత…

మెదక్ జిల్లా లోని మరి ప్రధాన మున్సిపాలిటీ అయిన రామాయంపేట లోనూ అధికార పార్టీకి ఎదురీత తప్పడం లేదు. ఈ మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో గట్టి పోటీ నెలకొంది. 25 ఏళ్లుగా పార్టీ ని నమ్ముకున్న తనకు అన్యాయం చేశారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుప్రభాత్ రావు పార్టీ ని వీడటం అధికార పార్టీకి నష్టం కలగటంతో ప్రతిపక్ష పార్టీ కి కలిసి వచ్చే అంశంగా మారింది. కష్టపడ్డ వారికి కాకుండా కాసులు ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నారు అనే ఆరోపణలు పార్టీకి మరింత నష్టం కలిగించేలా మారడంతో ఎదురీత తప్పడం లేదు.

నర్సాపూర్ లో బోణీ కి తిప్పలు…

ఇక జిల్లాలో లోని మరో మున్సిపాలిటీ అయిన నర్సాపూర్ లో బోణీ కొట్టాలని కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. డీసీసీ అధ్యక్షులు సొంత మున్సిపాలిటీ అయిన నర్సాపూర్ లో గతంలో ఒక్క కౌన్సిలర్ స్థానం కూడా దక్కకపోవడంతో ఈ సారి మున్సిపల్ తమ పార్టీ ప్రాతినిధ్యం వహించేలా నేతలు పావులు కదుపుతున్నారు. అన్ని మున్సిపాలిటీలో అధికార పార్టీ నేతలు అందరు తమ అన్ని శాయశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇక ఓటరు మహాశయుల ఆశీర్వాదం ఎవరికి ఉంటుందో వేచి చూడాల్సిందే.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.