📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

పోలీసులతోనే మస్తాన్ సాయి బేరసారాలు!

Author Icon By Vanipushpa
Updated: February 10, 2025 • 3:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న మస్తాన్‌ సాయి కేసులో రోజుకో రహస్యాలు బయటకు వస్తున్నాయి. ఇక తాజాగా మస్తాన్ సాయి లావణ్య కేసులో మరో ఆడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మస్తాన్ సాయి, అతడి తండ్రి మాట్లాడిన ఆడియో బయటపడింది. వీరు ఏకంగా పోలీసులతోనే బేరసారాలు ఆడినట్లు ఆడియోలు స్పష్టంగా వినిపిస్తోంది. మస్తాన్ సాయిపై లావణ్య పెట్టిన కేసులో పోలీసులతో బేరసారాలకు దిగారు వీరు. గతంలో ఏపీలోని గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో మస్తాన్ సాయిపై లావణ్య కేసు పెట్టింది. ఈ క్రమంలో ఈ కేసును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పోలీసులతో బేరసారాలు ఆడినట్లు తెలుస్తోంది.

పోలీసులకు డబ్బులు ఎర

ఛార్జ్‌షీట్ వేసే సమయంలో తమకు అనుకూలంగా రాస్తే డబ్బులు ఇస్తామని మస్తాన్‌ సాయి, అతడి తండ్రి పోలీసులకు తెలిపారు. పోలీసులకు డబ్బులు ఎరవేసి మరీ తనకు అనుకూలంగా కేసును మార్చుకున్నాడు మస్తాన్ సాయి. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మనకు అనుకూలంగా ఛార్జ్‌షీట్ ఉండాలని తండ్రితో మస్తాన్ సాయి మాట్లాడిన ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.యువతులను బ్లాక్ మెయిల్ చేసి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విచారణలో బయటపడింది. నగ్న వీడియోల కేసులో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు.

మస్తాన్ సాయి ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు

అలాగే మస్తాన్ సాయి ఎఫ్‌ఐఆర్‌లో కూడా కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. నగ్న వీడియోలే కాకుండా డ్రగ్స్ పార్టీలు కూడా చేసుకున్నట్లు బయటపడింది. వారాంతరాల్లో మస్తాన్ సాయి ఇంట్లో జరిగే డ్రగ్స్ పార్టీలకు యువతీయువకులు పాల్గొన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో డ్రగ్స్ బయటపడటంతో నార్కోటిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు.

లావణ్యపై విచక్షణారహితంగా దాడి

గతంలో మస్తాన్ సాయి సోదరి వద్దకు లావణ్య వెళ్లింది. ఈ క్రమంలో ఆమె వీడియోలు తీశాడు మస్తాన్ సాయి. దీనిపై ప్రశ్నించగా లావణ్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు.. అంతేకాకుండా లైంగిక దాడికి కూడా పాల్పడినట్లు అప్పట్లో పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది లావణ్య.ఈ కేసుకు సంబంధించి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కాకుండా తమకు అనుకూలంగా ఛార్జ్‌షీట్ వేసే విధంగా పోలీసులతో మస్తాన్ సాయి, తండ్రి బేరసారాలు ఆడినట్లు తెలుస్తోంది.

#telugu News Ap News in Telugu bargained with the police Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu mastan sai Paper Telugu News Telangana Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.