చర్ల (భద్రాచలం): మావోయిస్టు విప్లవోద్యమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పాశివిక దాడులతో మావోయిస్టు పార్టీపై భూస్వామ్య పెత్తందారులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem)జిల్లా అల్లూరి సీతారామరాజు డివిజన్ (బికే ఏఎస్ ఆర్) డివిజన్ కమిటి విప్లవ పేరుతో విడుదలైన లేఖ సంచలనం కలిగిస్తుంది. మావోల మనుగడ సన్నగిల్లిందని విప్లవోద్యమంపై భూస్వామ్య పెత్తందారుల విధానాలు మళ్ళీ హెచ్చరిల్లుతున్నాయి.

భూస్వాములు పైశాచిక చర్యలకు పాల్పడుతున్నట్లు
ఈ క్రమంలో పేదలు, సామాన్యులు, మధ్య తరగతి ప్రజలపై ఆయా వర్గాలు పెట్రేగి పోతున్నాయి. ప్రజలపై జరుగుతున్న ఈ దాడులను మావోయిస్టుపార్టీ చూస్తూ ఊరుకోదని, తీవ్ర హెచ్చరికలు చేసారు. భద్రాచలం చర్ల దుమ్ముగూడెం (Charla Dummugudem)మండలాల్లో కొందరు పెత్తందారులు ఈ పోకడలకు పాల్పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో రాజకీయ బ్రోకర్లతో కలిసి పెత్తందారులు, భూస్వాములు ఈ పైశాచిక చర్యలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. “ఖబడ్డార్” పెత్తందార్లలారా పద్దతి మార్చుకోండి, లేకుంటే ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదని అన్నారు. ఏజన్సీ ప్రాంతంలోని బడాబాబులు భూ స్వాములు రాజకీయ నాయకులు తమ వద్దతులు మార్చుకోవాలని చర్లకు చెందిన ప్రముఖ ఇసుక కాంట్రాక్టర్ల వ్యవహరశైలిపైనా ఘాటైన హెచ్చరికలు చేసారు. అప్పగించాలని లేకుంటే ఆ భూములను మా పార్టీ స్వాధీన పర్చుకొని పేదలకు పంచుతుందని హెచ్చరించారు. రాజకీయ నాయకులు మొదలు. కొని కొందరు వ్యాపారులు, భూస్వాములు పోలీసులకు పూర్తి ఇన్ఫార్మర్లుగా మారిపోయారు. పోలీస్ వ్యవస్థలో పనిచేస్తూ మా పార్టీకి సహకరిస్తున్నట్లుగా మోసపూరిత మాటలు చెప్పి కొందరు ఇన్ఫార్మర్స్ మమ్ములను మాయ చేస్తున్నారు వారికి మా ప్రజా కోర్టులో మరణ శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నాము. ఖబడ్డార్ పోలీస్ ఇన్ఫార్మర్స్ అన్నారు. మరో ముందడగు వేసి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని అనడంతో పరిస్థితి తీవ్రంగాభూ స్వాముల స్వాధీనంలో ఉన్న భూములను ఇకనైనా పేదలకు ఉన్నట్లు ఆ ఉన్నట్లు అర్ధం అవుతుంది. దీంతో ఇప్పటి వరకు గుట్టుగా మావోలకు ఇటు పొలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న వారు సైతం ఆందోళనలో పడ్డారు.
లేఖను బట్టి చూస్తే ఇన్ఫార్మర్ల వ్యవహరశైలి పై మావోలు నిషిత పరిశీలన చేసినట్లు తేటతెల్లం అవుతుంది ఇన్ఫార్మర్లకు వెన్నులో వణుకుపుట్టి అసలు మావోల లేఖ లేదా కావాలని ఎవరైన రాసారా అని కూపిలాగుతున్నారు. మావోల లేఖ అయితే ఇప్పడు తమ పరిస్థితి ఏమిటని వారిలో ఆందోళన మొదలైంది. ఇన్న మారాలని కోరారు. అడవులో ఖనిజ సంసదను ఎత్తుకెళ్ళేందుకు బ్రాహ్మణీయ ఫాసిస్టు, బాజాపా ప్రభుత్వంతో చేతులు కలుపుతూ మా పార్టీపై కుట్రలు పన్నుతున్నారు. గొల్లగుప్ప గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ పై జరిగిన అత్యాచారం పై న్యాయవిచారణ చేయాలని డిమాండ్ చేసారు. పూసుగుప్పలో జరిగిన మారణాలపై కూడా న్యాయం చేయాలని అన్నారు. ఆపరేషన్ కగార్లో అమరులైన వారి త్యాగాల స్ఫూర్తితో ముందుకుసాగుదాం. ఆదివాసీలు, పార్టీ సభ్యులపై సాగుతున్న మారణకాండకు బదులు తీర్చుకుంటాం. ప్రజలకోసం పని చేసే మావోయిస్టు పార్టీకి ప్రజాస్వామిక వాదులు, మేధావులు, విద్యావంతులు, జర్నలి స్థులు, పౌర హక్కులు, మానవ హక్కులు సంఘాలు విప్లవోద్యమాలు ఉద్యమాలకు మద్దుతు ఇవ్వాలని కోరారు.ప్రజా యుద్ధం కొనసాగిద్దాం ఆమరుల త్యాగాలను ఎత్తిపడదాం. విప్లవ పోరాటాలు కొనసాగిద్దామని విప్లవ పేరుతో విడుదలైన లేఖలో పేర్కొని ఉంది. కాగా ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న దాడులతో గత కొంతకాలంగా మునుగడే ప్రశ్నార్ధకంగా మారిక క్రమంలో స్తబ్దతగా ఉన్న మావోయిస్టు సరిహద్దు ప్రాంతాలలో ఎటువంటి ఆలజడులకు పాల్పడలేదు. తాజా వ్యాపారులు రాజకీయ నాయకులు భూస్వాములకు ఇసుక వ్యాపారులకు ఘాటైన హెచ్చరికల నేపద్యంలో ఈ ప్రాంతంలో మళ్లీ అలజడి నెలకొంది. విప్లవ పేరుతో విడుదలైన లేఖ నిజమా కాదా అని కొందరు వ్యాపారులు రాజకీయ నాయకులు మావోల ఇన్ఫార్మర్లల ద్వారా ఆరాతీస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే లేఖ పై స్పష్టత వచ్చేందుకు పొలీసులు ఇంటిలిజెన్సీ వర్గాలు ఆరాతీస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో మావోల లేఖపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని బావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: