📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

డాక్టర్ హత్యాయత్నం కేసులో సంచల నిజాలు!

Author Icon By Vanipushpa
Updated: February 27, 2025 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన యువ డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం ఘటనలో పోలీసులు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. యువ వైద్యుడి భార్య ప్రభుత్వ లెక్చరర్. తన ప్రియుడికి సుపారీ ఇచ్చి ఓ కానిస్టేబుల్ తో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసినట్లు వరంగల్ పోలీసులు నిర్ధారించారు.. వివాహేతర సంబంధమే ఈ రక్తపు మరకలు వెనకున్న అసలు నిజం అని తేల్చారు. ఆ నీచులను అరెస్టు చేసిన పోలీసులు ముగ్గురిని కటకటాల్లోకి పంపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మిస్టరీని ఛేదించిన పోలీసులు
ఫిబ్రవరి 20వ తేదీన వరంగల్ లో సంచలనం సృష్టించిన యువ డాక్టర్ సుమంత్ రెడ్డి పై హత్యాయత్నం ఘటన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆ దారుణ ఘటన వెనుక అసలు సంచలన నిజాలను బయట పెట్టారు. వరంగల్ – కాజీపేట మద్య బట్టుపల్లి బైపాస్ రోడ్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. కారులో ఒంటరిగా వెళ్తున్న సుమంత్ రెడ్డి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కారును వెంబడించి హత్యాయత్నం చేశారు. నడిరోడ్డుపై అతని కారు ఆపి విచక్షణారహితంగా ఇనుపరాడ్లతో కొట్టి అతను చనిపోయాడనుకుని వదిలేసి అక్కడి నుండి పారిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సుమంత్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సుమంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.


జిమ్ ట్రైనర్ శామ్యూల్ తో ప్రేమమైకం
డాక్టర్ సుమంత్ రెడ్డి – ఫ్లోరా మరియాకు 2016లో వివాహం జరిగింది. సంగారెడ్డి PHCలో వైద్యుడిగా పనిచేసేవాడు సుమంత్. అతని భార్య ఫ్లోరా మరియా ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేసేది. ఈ క్రమంలో సంగారెడ్డిలో ఫిట్నెస్ కోసం జిమ్ కు వెళ్తున్న వైద్యుడి భార్య ఫ్లోరా మరియా జిమ్ ట్రైనర్ శామ్యూల్ తో ప్రేమలో పడింది. వాళ్ల పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వాళ్ళ యవ్వారం డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలియడంతో భార్యను మందలించి అక్కడి నుండి వరంగల్ తీసుకువచ్చారు.

విడాకులు కావాలని భర్త పైన ఒత్తిడి

కాజీపేటలో ఓ క్లినిక్ పెట్టుకుని తన వైద్య వృత్తిని కొనసాగిస్తున్నాడు. 2019లో ఫ్లోరా మరియాకు సాంఘిక సంక్షేమశాఖలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ గా ఉద్యోగం వచ్చింది. కానీ ఫ్లోరా మరియా ప్రవర్తనలో మాత్రం మార్పులేదు. తన ప్రియుడు శామ్యూల్‌తో యథావిధిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. నిత్యం ఫోన్ లో వీడియో కాల్స్ మాట్లాడడం.. వీకెండ్స్‌లో కలుసుకుంటూ వీళ్ళ వివాహేతర సంబందాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం భర్త సుమంత్ రెడ్డికి తెలియడంతో మరోసారి మందలించాడు. ఈ క్రమంలో తనకు విడాకులు కావాలని భర్త పైన ఒత్తిడి తెచ్చింది. కానీ విడాకులు ఇవ్వడానికి సుమంత్ రెడ్డి నిరాకరించడంతో తన భర్తను కడతేర్చాలని ఖతర్నాక్ స్కెచ్ వేసింది. తన భర్తను ఎలాగైనా హతమార్చాలని ప్రియుడికి సూచించి ఖర్చుల కోసం ఒక లక్ష రూపాయలు అతనికి ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసింది. అయితే ప్రియురాలి సుపారీతో మర్డర్ ప్లాన్ చేసిన శామ్యూల్ తన స్నేహితుడు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజు సహాయంతో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ హత్య ఘటనలో సహకరించిన రాజుకు పని ప్రశాంతంగా పూర్తయితే ఒక ఇల్లు కట్టిస్తామని ఒప్పందం మేరకు అతన్ని ఇందులో పాత్రధారుడిని చేశారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu doctor's murder attempt! Google News in Telugu kazipet Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news warangal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.