📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం..వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య

Author Icon By Anusha
Updated: July 3, 2025 • 1:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది.ఒకవైపు కట్టుకున్న భర్త అనుమానం, మరోవైపు ప్రేమిస్తున్నానంటూ యువకుడి వేధింపులు. ఓ వివాహిత జీవితాన్ని ఛిద్రం చేశాయి. ఇద్దరి మధ్య నలిగిపోయి, మనోవేదనకు గురై కఠిన నిర్ణయం తీసుకుంది. వారి టార్చర్ తట్టుకోలేకఆత్మహత్య చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా (Khammam District) తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన శైలజకు ఎనిమిదేళ్ల క్రితం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన ఏదుల సతీశ్‌కుమార్‌తో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల కిందట, శైలజతోపాటు చదువుకున్న ఆర్మీ ఉద్యోగి కె.శ్రీరామ్ పిండిప్రోలులో ఆమెకు తారసపడ్డాడు. అప్పటి నుంచి శ్రీరామ్ ఆమెను ప్రేమిస్తున్నాను అంటూ వేధించడం మొదలుపెట్టాడు. పిల్లలను వదిలి తన వద్దకు రావాలని ఒత్తిడి చేశాడు.

రెండువైపుల నుంచి ఎదురైన ఈ వేధింపులతో

ఈ విషయంపై గతంలో పిండిప్రోలులో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి శ్రీరామ్‌ను హెచ్చరించారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.శ్రీరామ్ వేధింపుల కారణంగా భర్త సతీశ్‌కుమార్ (Sathish Kumar) శైలజపై అనుమానం పెంచుకున్నాడు. శారీరకంగా, మానసికంగా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. రెండువైపుల నుంచి ఎదురైన ఈ వేధింపులతో శైలజ తీవ్ర మనోవేదనకు గురైంది. జూన్ 26న (బుధవారం) ఆమె ఎలుకల మందు తిని తీవ్ర అస్వస్థతకు గురైంది. తొలుత ఆమెను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మహబూబాబాద్‌లోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి (జూలై 1) ఆమె మరణించింది.

Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం..వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య

దర్యాప్తు జరుపుతున్నారు

తన కుమార్తె మరణానికి ఆమె భర్త ఏదుల సతీశ్‌కుమార్, పిండిప్రోలుకు చెందిన శ్రీరామ్ కారణమంటూ శైలజ తల్లి బుధవారం గార్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రియాజ్‌పాషా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనతో శైలజ (Sailaja) జీవితం అర్థాంతరంగా ముగియగా ఇద్దరు పిల్లలు తల్లిలేనివారయ్యారు. కాగా, శైలజ మృతితో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ కుమార్తె చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: Rain: తెలంగాణకు రెయిన్ అలర్ట్..పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ

#MahabubabadTragedy #DomesticAbuse #MentalTorture #WomanSuicide #TelanganaNews #RelationshipAbuse #StopHarassment #JusticeForWomen affair pressure Ap News in Telugu Breaking News in Telugu domestic abuse emotional trauma Garla mandal Google News in Telugu harassment by husband Latest News in Telugu Mahabubabad incident marital conflict married woman suicide mental torture Mulkanoor village Paper Telugu News relationship issues Telangana news Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today tragic suicide woman ends life youth harassment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.