📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Kunamneni: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనికి హైకోర్టులో భారీ ఊరట

Author Icon By Anusha
Updated: June 10, 2025 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కూనంనేనిపై దాఖలైన ఎన్నికల పిటిషన్ చట్టవ్యతిరేకమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాలు,తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల్లో కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సీపీఐ పార్టీ తరఫున పోటీ చేశారు. తన ప్రత్యర్థి జలగం జలగం వెంకట్రావుపై విజయం సాధించారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత నందులాల్(Nandulal) అనే ఒక ఓటరు కూనంనేనిపై సంచలన ఆరోపణలు చేశారు. నామినేషన్ సమయంలో కూనంనేని దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయన తన భార్య పేరు వెల్లడించలేదని నిజాలను దాచిన కారణంగా ఆయన ఎన్నిక చెల్లిదని ప్రకటించడమే కాక జరిమానా, శిక్ష విధించాలని కోరుతూ నందులాల్ తెలంగాణ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశాడు.

అఫిడవిట్‌

ఈ పిటిషన్‌పై సోమవారం నాడు జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. కూనంనేని ఎన్నికల నామినేషన్‌ సందర్భంగా అఫిడవిట్‌లో తన భార్య పేరు వెల్లడించకపోవడంపై పిటిషనర్‌ నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదని కోర్టు తెలిపింది. అంతేకాక ఎమ్మెల్యే కూనంనేని సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన తన భార్య పేరు మాత్రమే వెల్లడించలేదంది. కానీ ఆమె పేరుతో ఉన్న పాన్‌ నంబరు, నామినేషన్ దాఖలుకు ముందు ఐదేళ్లకు సంబంధించి, ఆస్తులు, అప్పులు, ఐటీ రిటర్నులు వివరాలు వెల్లడించారని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది.

Kunamneni

ఎన్నిక చెల్లదని

అంతేకాక కూనంనేని తన ఎన్నికల అఫిడవిట్‌లో భాగస్వామి పేరు అనే కాలమ్ దగ్గర తన భార్య పేరు ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా, పైన తెలిపిన వివరాల్లో ఆమె పేరు వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. అలానే కూనంనేని(Kunamneni) దాఖలు చేసిన నామినేషన్ ఎన్నికల నిబంధనల ప్రకారమే ఉండటం వల్లనే రిటర్నింగ్‌ అధికారి దాన్ని ఆమోదించారని కోర్టు స్పష్టం చేసింది. అఫిడవిట్‌లో భార్య పేరు వెల్లడించకపోయినంత మాత్రాన ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా కూనంనేని ఎన్నిక చెల్లదని తీర్పు ఇవ్వలేమని జస్టిస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ తీర్పుపై కూనంనేని అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Phone Tapping Case : ముగిసిన ప్రభాకర్ రావు విచారణ

#ElectionPetitionDismissed #HighCourtRelief #KunamneniSambasivaRao #Telangana highcourt #TelanganaPolitics Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.