📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

KTR: కవిత లేఖపై స్పందించిన కేటీఆర్

Author Icon By Ramya
Updated: May 24, 2025 • 12:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కవిత లేఖ పై కలకలం: బీఆర్ఎస్ లో అంతర్గత విబేధాల సంకేతమా?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీలో ఒక వివాదాస్పద అంశం తీవ్ర చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత రాసిన వ్యక్తిగత లేఖ లీక్ అవడం పార్టీ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఈ లేఖ వెలుగులోకి రావడంపై కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పార్టీ లోపలే ద్రోహశక్తులు పని చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రిని దేవుడిగా అభివర్ణించిన ఆమె, ఆయన చుట్టూ దయ్యాలు చేరాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కాంగ్రెస్ కోవర్టులు ఉన్నారని, తన తండ్రికి తాను రాసిన లేఖ బయటకు రావడమే దీనికి నిదర్శనమని కవిత చెప్పారు. కవిత రాసిన లేఖపై ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ శనివారం స్పందన.

కేటీఆర్ స్పందన: చక్కటి రాజకీయ సంయమనం

పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా (Media) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని అంతర్గత విషయాలను పార్టీలో అంతర్గతంగానే చర్చించాలని హితవు పలికారు. పార్టీలో తనతో సహా అందరూ కార్యకర్తలేనని, ఈ నియమం అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. వాస్తవానికి నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై మాట్లాడేందుకు కేటీఆర్ (KTR) ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే, కవిత లేఖపై స్పందించాలంటూ మీడియా ప్రతినిధులు కోరగా.. ఆయన ముక్తసరిగా స్పందించారు. రెండు ముక్కల్లో విషయం తేల్చేసి, దానిపై ఇక మాట్లాడేదీ లేదని చెప్పారు.

బీఆర్ఎస్ లో కోవర్టుల వ్యాఖ్యలు: రాజకీయ వాస్తవమా, భావోద్వేగమా?

బీఆర్ఎస్‌ (BRS) లో కోవర్టులు ఉన్నారని కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ప్రతీ పార్టీలోనూ అలాంటి క్తులు ఉండే అవకాశం ఉంటుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అయితే, సమయం వచ్చినప్పుడు ఎవరు నిజమైన కార్యకర్తలు, ఎవరు స్వార్థ రాజకీయాలకు పనికొచ్చే కోవర్టులన్నది తేలిపోతుందని పేర్కొన్నారు. పార్టీ ప్రజలది అని, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతీ కార్యకర్తకు పార్టీ అధ్యక్షుడికి తమ అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఉందని, అది లేఖ రూపంలోనైనా, ఫోన్ లోనైనా, ప్రత్యక్షంగా అయినా సాధ్యమని వివరించారు. అయితే, కొన్ని విషయాలు బహిరంగంగా చర్చించకూడదని, అంతర్గతంగా మాత్రమే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని మరోసారి స్పష్టం చేశారు.

కవిత పేరు ప్రస్తావించకుండా జాగ్రత్త తీరు

పార్టీలో ఏ కార్యకర్త అయినా తన అభిప్రాయాలను, సూచనలను అధ్యక్షుడికి తెలియజేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ అభిప్రాయ వెల్లడి అనేది మౌఖికంగా, లేఖల ద్వారా, ఫోన్ ద్వారా, నేరుగా కలిసి మాట్లాడడం ద్వారా.. ఇలా వివిధ పద్ధతులలో జరుగుతుంటుందని వివరించారు. అయితే, కొన్ని విషయాలను అంతర్గతంగా చర్చించాల్సి ఉంటుందని, వాటిని అంతర్గతంగానే చర్చించాలని కేటీఆర్ చెప్పారు. కాగా, ప్రెస్ మీట్ పూర్తయ్యేవరకూ కేటీఆర్ తన సోదరి కవిత పేరెత్తకపోవడం గమనార్హం.

Read also: KTR: రేవంత్ రెడ్డి పాలన పై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు

#BRS #Poetry #CongressVsBRS #KCR #ktr #Party Differences #RevanthReddy #TelanganaPolitics Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.