📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

KTR: రేవంత్ రెడ్డి పాలన పై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు

Author Icon By Ramya
Updated: May 24, 2025 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రేవంత్ పాలనపై కేటీఆర్ విరుచుకుపడ్డారు: ఢిల్లీకి మూటలు – తెలంగాణకు మోసాలు!

తెలంగాణలో పాలనపై మరోసారి రాజకీయం రగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను తీవ్రంగా విమర్శించిన బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మాటల మనిషి కాదు, మూటల మనిషి అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, తెలంగాణ రాష్ట్ర సంపదను ఢిల్లీ (Delhi) కి తరలిస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారిందని పేర్కొంటూ, ప్రతి పాలనా చర్య వెనుక కమీషన్లు, కాంట్రాక్టులు, కమిషన్ల కలబోత ఉన్నదని ఆరోపించారు. బీఆర్ఎస్‌ను నిందిస్తూ పబ్లిసిటీ తెచ్చుకుంటూ, మరోవైపు బిల్డర్లతో సెట్ అయ్యి, ఢిల్లీ (Delhi) పెద్దలకు చందాలు పంపడమే రేవంత్ పాలనలక్షణంగా మారిందని విరుచుకుపడ్డారు.

“మూటలు మోసి పదవులు కొనుగోలు”: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోసం రూ.50 కోట్లు చెల్లించాడని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి గతంలో ఆరోపించారని కేటీఆర్ గుర్తుచేశారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై కేటీఆర్ (KTR) ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ డీఎన్ఏ లోనే కరప్షన్ ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వస్తే దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే పదవి నుంచి తప్పుకోవాలని ఇదే కాంగ్రెస్ లీడర్లు కర్ణాటకలో డిమాండ్ చేశారని కేటీఆర్ గుర్తుచేశారు.

రాజీనామా చేసిన యడియూరప్ప ఉదాహరణను గుర్తుచేసిన కేటీఆర్

కాంగ్రెస్ డిమాండ్లకు స్పందించిన యడియూరప్ప అప్పట్లో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Ed) సంచలన ఆరోపణలు చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో ఆయన సూచనల మేరకే ‘యంగ్ ఇండియన్’ కంపెనీకి డొనేషన్లు ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పారని ఈడీ వెల్లడించిందన్నారు. రేవంత్ సూచనతో, నెల రోజుల వ్యవధిలో యంగ్ ఇండియన్ కంపెనీకి రూ.80 లక్షల వరకు బదిలీ చేసినట్లు ఈడీ ఆరోపించిందన్నారు.

“ఓటుకు నోటు” నుండి “కమిషన్ల రాజకీయాల” దాకా..

ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరగాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దర్యాప్తు నిష్ఫక్షపాతంగా జరగాలంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసును తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదని కేటీఆర్ చెప్పారు. ఈ కేసు తర్వాత రేవంత్ రెడ్డి మారిపోయాడని తాము భావించామన్నారు. అయితే, కుక్క తోక వంకర, దానిని ఎవరూ సరిచేయలేరన్నట్లు ఆయన మారలేదని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read also: Railway Line: కరీంనగర్- సికింద్రాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్

Read also: Dharmapuri Arvind : రేవంత్ రెడ్డి, కవిత మంచి ఫ్రెండ్స్ : అర్వింద్

#brsvscongress #CongressScam #CorruptionAllegations #DelhiDonations #EDInvestigation #KTRPressMeet #KTRVsRevanth #MootalaCM #RevanthReddiLeaks #RevanthResign #TelanganaATM #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu NationalHeraldCase Paper Telugu News PoliticalControversy TelanganaNews TelanganaPolitics Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.