📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

KTR: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

Author Icon By Ramya
Updated: May 27, 2025 • 3:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు – ఫార్ములా ఈ కేసు మరింత వేడెక్కుతోంది

మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన “ఫార్ములా ఈ” రేసుతో సంబంధించి జరిగిన అనియమాలపై దర్యాప్తు కొనసాగుతుండగా, మే 28న విచారణకు హాజరుకావాలని ఏసీబీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసు మళ్లీ జోరందుకోవడం, ఇందులో కేటీఆర్ పేరుతో పాటు మున్సిపల్ శాఖ అధికారుల పేర్లు వినిపించడమూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

KTR

ఫార్ములా ఈ కేసులో కొత్త మలుపు – కేటీఆర్ స్పందన

ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ, “చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. ఏసీబీ దర్యాప్తుకు పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికే ఫార్ములా ఈ కేసుకు సంబంధించి లిఖితపూర్వకంగా అవసరమైన సమాచారం ఇచ్చాను. అయితే, నెలాఖరులో అమెరికా, యూకే పర్యటన షెడ్యూల్‌ ఇప్పటికే ఖరారైనందున తిరిగి వచ్చిన తరువాత హాజరవుతానని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు సహకరిస్తానని, ఫార్ములా ఈ కేసుపై ఏసీబీకి లిఖితపూర్వక సమాచారమిచ్చా కేటీఆర్ తెలిపారు. కాగా ఫార్ములా ఈ కేసులో గతంలో కేటీఆర్ సహా అప్పటి మున్సిపల్ శాఖ కార్యదర్శి ఆర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్‌ రెడ్డి లను ఏసీబీ విచారించింది. మరో వైపు ఈడి సైతం ఈ వ్యవహారంలో దర్యాప్తు చేస్తోంది.

గతంలోనే విచారితులైన అధికారులు – ఈడీ రంగంలోకి

ఇది తొలిసారి కాదు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి లను ఏసీబీ విచారించిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే కేసును డీటెయిల్‌గా పరిశీలించిన ఏసీబీ, నూతన ప్రభుత్వ ఆదేశాల మేరకు మళ్లీ దర్యాప్తును వేగవంతం చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. విదేశీ నిధుల వినియోగం, మారిన టెండర్లు, ఎలక్ట్రిక్ వాహనాల ప్రమోషన్ పేరిట జరిగిన వ్యయాలు వంటి అంశాలపై ఈడీ దర్యాప్తు జరుపుతోందని సమాచారం. ఈ చర్యలన్నీ కలిపి కేసుకు మరింత తీవ్రతను కలిగిస్తున్నాయి.

రాజకీయ కక్షతోనే నోటీసులు – సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

రాజకీయ వేధింపుల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారని, రాజకీయ కక్ష కోసం తహతహలాడుతున్నాడని కేటీఆర్ విమర్శించారు. 48 గంటల క్రితం ఈడీ ఛార్జిషీట్‌ (ED chargesheet) లో సీఎం రేవంత్ పేరు వచ్చిందని, 24 గంటల క్రితమే ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలను రేవంత్ కలిశారని అన్నారు. ఇవాళ తనకు ఏసీబీ నుంచి నోటీసులు వచ్చాయని, మనీలాండరింగ్‌లో రేవంత్‌ ప్రమేయంపై బీజేపీ నుంచి ఒక్క మాట కూడా లేదని, రేవంత్‌ నాయకుడిగా, పాలకుడిగా విఫలం అయ్యారని తెలిపారు.

ప్రతీకార రాజకీయాలే ఇదీ – కల్పిత ఆరోపణలతో ప్రజలను మోసం చేయలేరు: హరీశ్‌రావు, కవిత సంఘీభావం

ఫార్ములా- ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. హరీశ్‌రావు ఎక్స్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలు ఆయన అభద్రతా భావానికి స్పష్టమైన సంకేతాలని చెప్పుకొచ్చారు. కల్పిత కేసులు న్యాయస్థానాల్లో నిలవవని, ప్రజా ఆమోదాన్ని పొందవని ఆయన అభిప్రాయపడ్డారు. కేటీఆర్‌కు అండగా నిలుస్తామని, సత్యమే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజాసమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు కుట్రపూరితంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేటీఆర్‌కు నోటీసులు జారీచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానమని కవిత అన్నారు. రేవంత్‌ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు స్పష్టమవుతోందని ఆమె ఎక్స్‌ వేదికగా తెలిపారు. బీఆర్‌ఎస్‌ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా, తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్‌ సైనికులదని కవిత వెల్లడించారు.

Read also: Gali Janardhana Reddy: చంచల్‌గూడ జైలు నుంచి బెంగళూరుకు గాలి జనార్దనరెడ్డి తరలింపు

#ACBNotices #BRSParty #CorruptionAllegations #EDProbe #FormulaERaceScandal #HyderabadNews #KTRInquiry #KTRUpdates #PoliticalInvestigation #TelanganaPolitics Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.