📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Konda Surekha: సుష్మితా రాజకీయ ప్రవేశంపై.. మంత్రి సురేఖ కామెంట్స్

Author Icon By Anusha
Updated: July 3, 2025 • 2:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వరంగల్ జిల్లా రాజకీయాలు ఇటీవల కొండా దంపతుల చర్యలతో కాస్త వేడెక్కాయి. ప్రత్యేకంగా, కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ, మురళి దంపతుల రాజకీయం మరోసారి ప్రాధాన్యత పొందింది. తాజాగా వారి కుమార్తె కొండా సుష్మితా పటేల్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనే వార్తలు, వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.గత కొంతకాలంగా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న సుష్మితా ఇటీవల తన సోషల్ మీడియాలో ‘పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి’ అని పేర్కొనడం చర్చకు దారితీసింది. ఇది వరంగల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రకంపనలు సృష్టిస్తోంది. కొండా దంపతుల రాజకీయ వారసురాలిగా సుష్మిత (Sushmita) ను రంగంలోకి దిగుతోందని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో కూడా ఆమె పేరు వినిపించింది, పరకాల నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రచారం కూడా జరిగింది.

రాజకీయ వర్గాల్లో చర్చ మెుదలైంది

అయితే చివరి నిమిషంలో ఆ సీటును రేవూరికి కేటాయించడంతో ఆమె వెనక్కి తగ్గింది.వరంగల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు చెలరేగుతున్న సమయంలో కొండా సుష్మితా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోను ‘పరకాల ఆస్పిరెంట్’ (పరకాల టికెట్ ఆశిస్తున్నాను) అని అప్‌డేట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మెుదలైంది. అనంతరం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యే కొండా దంపతులపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఇది వరకే వివరణ ఇచ్చిన కొండా మురళీ తాజాగా, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ (Meenakshi Natarajan) తో భేటీ లిఖితపూర్వకంగా వివరణ అందజేసారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తమ కూతురి రాజకీయ ఎంట్రీపై కొండా దంపతులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమ కూతురు ఆలోచనను తాము కాదనలేమని అన్నారు.

Konda Surekha:

హాట్ టాఫిక్‌

తనలో ప్రవహించేది తమ రక్తం కాబట్టి వారసత్వం కొనసాగుతుందని అన్నారు.తన రాజకీయ భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించుకునే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు. అయితే, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటామని ఆమె తెలిపారు. మరోవైపు కొండా మురళి (Konda Murali) మాత్రం కొంత భిన్నంగా స్పందించారు. తన కూతురు ఎక్కడి నుంచి పోటీ చేయడం లేదని చెప్పారు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుందని, తన కూతురు తొందరపడి అన్నదో, ఆలోచించి అన్నదో తనకైతే తెలియదని అన్నారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వరంగల్ పాలిటిక్స్‌లో హాట్ టాఫిక్‌గా మారాయి. ఆమె పొలిటికల్ ఎంట్రీపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Read Also: Ramchandar: రాంచందర్ రావుకు MLC కవిత కీలక సలహాలు

Ap News in Telugu Breaking News in Telugu Congress candidate Parakala Congress leadership conflict Google news Google News in Telugu internal rift in Congress Konda couple politics Konda family political legacy Konda Murali KONDA SUREKHA Konda Sushmitha Patel political entry Latest News in Telugu Paper Telugu News Parakala MLA candidate political rumors Parakala Sushmitha Patel Congress Telangana politics Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Warangal Congress politics Warangal election news Warangal political buzz

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.