తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో కొమురవెల్లి మల్లన్న ఆలయం ఒకటి. సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలోని ఒక కొండపై ఈ ఆలయంలో మల్లిఖార్జున స్వామి కొలువై ఉన్నాడు. సిద్ధిపేట నుంచి సుమారు 24 కి.మీ. హైదరాబాద్ నుంచి సుమారు 90 కి.మీ. దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ప్రతి ఏటా కొమురవెల్లి మల్లన్నను 25 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారని అంచనా. ముఖ్యంగా జాతర సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో కూడా రోజుకు 5 నుంచి 10 వేల మంది భక్తులు వస్తుంటారు.ప్రస్తుతం ఈ ఆలయానికి ప్రైవేటు వాహనాలు, బస్సుల్లో భక్తులు వస్తుంటారు. కొమురవెల్లి(Komuravelli)కి సుమారు 45 కి.మీ. దూరంలో జనగాం రైల్వే స్టేషన్ ఉంది. సికింద్రాబాద్ నుంచి కూడా లఖుడారం వంటి సమీప స్టేషన్లకు రైళ్లు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుండి స్థానిక బస్సులు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా ఆలయానికి వెళ్తుంటారు. ఆలయం సమీపంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎప్పట్నుంచో భక్తులు కోరుతున్నారు. దీంతో కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. తాజాగా స్టేషన్ ప్రారంభ తేదీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు.
కార్యక్రమాలు
రైల్వే అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది దసరా రోజున కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. ఇది భక్తులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే అవకాశం ఉంటుందన్నారు. ఇవాళ వరంగల్, కరీంనగర్, బేగంపేట స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి దసరా రోజున కొమురవెల్లి స్టేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. ఇక యాదగిరిగుట్ట(Yadagirigutta)కు కూడా ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో రూ. 80 వేల కోట్ల పనులకు సంబంధించి ప్లాన్లు జరుగుతున్నాయని, రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో విప్లవాత్మక కార్యక్రమాలు చేసి చూపిస్తామని ఆయన తెలిపారు.
కేంద్రం
రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ సమస్య ఉందని రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా భూసేకరణ చేసి ఇవ్వాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందని 2026 నాటికి 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందబోతున్నాయని చెప్పారు. బేగంపేట రైల్వే స్టేషన్‌లో అన్ని విభాగాల్లో మహిళా సిబ్బందే ప్రజలకు సేవలు అందించబోతున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Covid: స్వల్పంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల్లో అప్రమత్తమైన రేవంత్ రెడ్డి సర్కార్