Komali: డైరీలో యూట్యూబర్ కోమలి చివరి మాటలు

Read Time:  1 min
Komali: డైరీలో యూట్యూబర్ కోమలి చివరి మాటలు
FONT SIZE
GET APP

Komali: డైరీలో యూట్యూబర్ కోమలి చివరి మాటలు హైదరాబాద్‌లో (Hyderabad) నివసిస్తున్న విశాఖపట్నంకు చెందిన యువ యూట్యూబర్ బోను కోమలి (21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. బీఎస్సీ చదువుతూనే సోషల్ మీడియాలో వ్లాగ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కోమలి, తన అద్దె ఫ్లాట్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ విఫలం కావడమే ఈ నిర్ణయానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Read Also: Jagga Reddy: మల్లికార్జున ఖర్గేతో జగ్గారెడ్డి భేటీ

Komali: డైరీలో యూట్యూబర్ కోమలి చివరి మాటలు
Komali: YouTuber Komali’s last words in the diary

డైరీలో బయటపడ్డ ఆవేదన

“ముందుకు సాగిపోవాలంటే భయంగా ఉంది. ఎందుకంటే ఒకవేళ అతను తిరిగి వస్తే? నేను అతడిని వదిలేయాలని తెలుసు. అతను నా వాడు కాదని కూడా నాకు తెలుసు. నాతో ఉండటానికి అతను ప్రయత్నించడం లేదనీ తెలుసు. అయినా నాలోని ఏదో ఒక భాగం అతని కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది. ఏదో ఒక రోజు అతను నన్ను ఎంచుకుంటాడని ఆశిస్తూనే ఉంది” అని కోమలి తన డైరీలో ఆవేదన వ్యక్తం చేసింది. తాను పూర్తిగా దూరంగా వెళ్లిపోయిన తర్వాత, అతను వెనక్కి తిరిగి తన కోసం చూస్తే ఏం చేయాలనే భయం తనను వెంటాడుతోందని ఆ నోట్‌లో రాసింది.

“ఐ లవ్యూ మమ్మీ” అని చివరి మెసేజ్

సోమవారం తెల్లవారుజామున కువైట్‌లో పనిచేస్తున్న తన తల్లి సత్య వరలక్ష్మికి “ఐ లవ్యూ సో మచ్ మమ్మీ” అని, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని కోమలి మెసేజ్ పంపింది. ఆ తర్వాత ఆమె ఫోన్‌కు ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందన లేకపోవడంతో ఆందోళన చెందిన ఆమె తల్లి, హైదరాబాద్‌లోని స్నేహితులకు సమాచారం ఇచ్చారు. వారు మధ్యాహ్నం ఫ్లాట్‌కు వెళ్లి చూడగా, తలుపులు మూసి ఉన్నాయి. పోలీసుల సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, కోమలి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని కనిపించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.