📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

IPhone: తండ్రి నుంచి రూ.2 లక్షలు చోరీ..ఐఫోన్‌ కొనుగోలు చేసిన పిల్లోడు!

Author Icon By Vanipushpa
Updated: April 30, 2025 • 5:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పిల్లలను ఎంతో కష్టపడి చదివించి, వారిని ఎలాగైనా ప్రయోజకులను చేయాలని తల్లిదండ్రులు అహోరాత్రులు కలలుకంటూ ఉంటారు. తాజాగా ఏడో తరగతి చదువుతున్న ఓ పుత్ర రత్నం ఏకంగా తండ్రి దుకాణంలో విడతల వారీగా డబ్బు చోరీ చేసి తన ట్యూషన్‌ టీచర్‌ వద్ద దాచుకున్నాడు. ఆనక ఆ డబ్బుతో ఏకంగా ఐఫోన్‌ కొనేశాడు. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని జీడిమెట్లలో వెలుగు చూసింది. జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్‌ వివరాల మేరకు..

ఏడాదిగా డబ్బులు చోరీ
జీడిమెట్ల షాపూర్‌నగర్‌ హెచ్‌ఎంటీ సొసైటీలో నివసించే కమల్‌ జైన్‌ అనే వ్యక్తి స్థానికంగా చక్కెర వ్యాపారం చేస్తుంటాడు. అతనికి ఏడో తరగతి చదివే కుమారుడు ఉన్నాడు. కుమారుడు బాగా చదువుకోవాలని తండ్రి కమల్‌ జైన్‌.. ఇంటి ఎదురుగా ఉండే సందీప్‌ గేలో అనే వ్యక్తి వద్దకు ట్యూషన్‌కు పంపించేవాడు. ఈ క్రమంలో కొన్ని నెలల్లనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తండ్రి చేసే వ్యాపారం గురించి బాగా అవగాహన ఉన్న కొడుకు.. ట్యూషన్‌ మాస్టర్‌ కొడుకు సాయంతో దుకాణంలో ఏడాదిగా డబ్బులు చోరీ చేయడం ప్రారంభించాడు. ఇలా పలు దఫాలుగా సుమారు రూ.2లక్షల వరకు తండ్రి దుకాణంలో చోరీ చేసి ట్యూషన్‌ మాస్టర్‌కి అందజేశాడు. ఆ డబ్బులతో వ్యాపారి కొడుక్కి ఐఫోన్‌ కూడా కొన్నిచ్చాడు. దీంతో ఫోన్‌ ఎక్కడిదని తండ్రి ఆరా తీయడంతో ట్యూషన్‌ టీచర్‌ ఇప్పించారని చెప్పాడు.
కుమారుడు ఐఫోన్‌ వాడుతున్నా పసిగట్టకలేకపోయినా పేరెంట్స్
కొనుగోలు చేసేందుకు డబ్బులు ఎక్కడివని గట్టిగా నిలదీయడంతో దుకాణంలో తస్కరించిన యవ్వారం బయటపడింది. దీంతో కుమారుడికి ట్యూషన్‌ చెబుతున్న వ్యక్తిపై జీడిమెట్ల పీఎస్‌లో కమల్‌జైన్‌ ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ట్యూషన్‌ మాస్టారు సందీప్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: Miss World 2025 : అందాల పోటీలపై సీపీఐ నారాయణ విమర్శలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu buys iPhone! from father Google News in Telugu Kid steals Rs. 2 lakh Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.