📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Khammam: ఆన్‌లైన్‌లో చెప్పులు ఆర్డర్ చేస్తే చివరికి ఏమొచ్చిందంటే?

Author Icon By Anusha
Updated: June 3, 2025 • 11:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ రోజుల్లో అడుగడుగునా ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ, సైబర్ నేరగాళ్లు(Cyber ​​criminals) అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్‌ పేరిట జరుగుతున్న మోసాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.ఆన్‌లైన్‌లో కాస్ట్లీ వస్తువులు కొనుగోలు చేసినప్పుడు అవి ఇంటికి డెలివరీ కాకపోవడం లేదా వాటి స్థానంలో మరొకటి పార్శిల్‌లో ఉండటం లాంటి ఘటనలు మనం తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైన ఘటన ఈ తరహా మోసాల్లో మరో ఉదాహరణగా నిలిచింది.

చైతన్యం

బోదులబండకు చెందిన కాకాని సీతారాంచౌదరి(Sitaram chowdhary) అనే వ్యక్తి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ మింత్రా యాప్‌ ద్వారా మోచీ బ్రాండ్‌ మెన్ లెదర్ కంఫర్ట్ శాండిల్స్‌ను ఆర్డర్ చేశారు. వీటి ధర ₹3,990. ఆర్డర్ సమయంలోనే అతడు ఆ మొత్తం మొత్తాన్ని ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా చెల్లించారు.సోమవారం వచ్చిన పార్సిల్ తెరిచి చూడగా, అందులో కనిపించింది అసలు ఊహించనిది – ప్యాక్‌లో బ్రాండ్ న్యూ చెప్పు(Brand New Sandals)లు కాకుండా, ఒక మురికి, వాడిన చెప్పు మాత్రమే ఉంది.ముఖ్యంగా విలువైన వస్తువులు ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ సమయంలో వీడియో తీసి ఉంచడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్న మోసాల నుండి రక్షణగా నిలుస్తోంది.

Khammam

సంబంధిత

ఇటువంటి ఘటనలు రోజు రోజుకీ పెరుగుతుండటంతో, వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతున్నాయి కొన్ని ఈ-కామర్స్ సంస్థలు. మింత్రా వంటి పెద్ద సంస్థలు తమ డెలివరీ వ్యవస్థను మరింత పటిష్టంగా చేసి, వినియోగదారుల నమ్మకాన్ని పొందేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఈ నేపథ్యంలో వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డెలివరీ వస్తువులను తీసుకునేటప్పుడు ప్యాకేజింగ్ స్టేటస్‌(Packaging status)ను పరిశీలించడం, వీడియో తీసుకోవడం, అనుమానాస్పద వస్తువు వచ్చినపుడు వెంటనే ఫోటోలు తీసి, సంబంధిత సంస్థకు రిపోర్ట్ చేయడం వంటి చర్యలు తప్పనిసరిగా పాటించాలి. అంతేకాదు, ఇలా మోసపోతే న్యాయపరమైన పరిరక్షణ కోసం వినియోగదారుల హక్కుల సంస్థలను ఆశ్రయించాల్సిన అవసరమూ ఉంది.

Read Also: Jaggareddy: రాహుల్ పై కేంద్రం కుట్రపూరిత విమర్శలు చేస్తుందన్న జగ్గారెడ్డి

#CustomerShock #MyntraMess #OnlineShoppingFail #WrongDelivery Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.