📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

KCR: వరుస కేసులతో రూటు మార్చిన కెసిఆర్

Author Icon By Anusha
Updated: May 28, 2025 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకి ఆసక్తి కరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో రాజకీయంగా ఉచ్చు బిగించేందుకు ఇదే సరైన సమయంగా కాంగ్రెస్ భావిస్తోంది. ఇటు కేసీఆర్(KCR) అప్రమత్తం అయ్యారు. వరుసగా రాజకీయ సమీకరణాలతో పాటుగా వెంటాడుతున్న కేసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అటు కేటీఆర్ కు ఫార్ములా ఈ రేసు కేసులో మరో సారి నోటీసులు అందాయి. ఈ సమయంలోనే కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణలో బీఆర్ఎస్ కు ఫిక్స్ చేసేందుకు కాంగ్రెస్(Congress) వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. జూన్ 2 న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అటు కేటీఆర్ కు మరో సారి ఫార్ములా ఈ రేసు కేసులో నోటీసులు జారీ అయ్యాయి. కవిత తనకు పార్టీలో ప్రాధాన్యత పైన పట్టు బడుతున్నారు. కవిత రాసిన లేఖ పార్టీలో సంచలనంగా మారుతోంది. కేసీఆర్ సన్నిహితులు మధ్య వర్తిత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకుంటే తన దారి తాను చూసుకుంటానని కవిత భీష్మించినట్లు సమాచారం. ఇదే సమయంలో కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు అందాయి. ఇలా అన్ని వైపులా మూకుమ్మడిగా వస్తున్న సమస్యల వేళ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయం వెల్లడించారు.

అధికారులు

కాళేశ్వరం కమిషన్‌ ఎదుట విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయిం చారు. రిటైర్డ్‌ ఇంజనీర్లు, న్యాయ నిపుణుల సూచనలు, సలహాల అనంతరం జూన్‌ ఐదో తేదీన విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ 9న విచారణకు హాజరవుతానని ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు కూడా. కాళేశ్వరం కమిషన్‌(Kaleshwaram Commission) ఇప్పటికే వంద కుపైగా అధికారులు, ఇతర వ్యక్తులను విచారించింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే నడుచుకున్నామని వారిలో అత్యధికులు కమిషన్‌కు స్పష్టం చేశారు. తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ విద్యుత్తు అవకతవకలపై నియమించిన కమిషన్‌ నోటీసులు జారీ చేసిన సమయంలో కేసీఆర్‌ న్యాయస్థానాలను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు నుంచి ఊరట పొందారు. దాంతో, కాళేశ్వరం కమిషన్‌ ఎదుట ఆయన హాజరుపై సందిగ్ధం నెలకొంది.

KCR: వరుస కేసులతో రూటు మార్చిన కెసిఆర్

సమాచారం

కేసీఆర్‌ రెండు దఫాలుగా ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో మాజీ మంత్రి హరీశ్‌ రావుతో ఒకసారి కేటీఆర్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. నోటీసులపై ఏవిధంగా స్పందించాలనే అంశం పైన సమాలోచన చేసినట్లు తెలిసింది. ఇప్పటికే విచారణకు వెళ్లి వచ్చిన రిటైర్డ్‌ ఇంజనీర్లతోనూ బీఆర్‌ఎస్‌(BRS) అధినేత సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీటికితోడు, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ లకు డ్యామేజీ అయ్యేవరకు జరిగిన పరిణామాలపై సమాచారం సేకరించారు. సమస్యలు తలెత్త డానికి ప్రధాన కారణాలు ఏమిటన్న దానిపైనా ఆయన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, దేశ వ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న వాటికి సంబంధించిన సమాచా రాన్ని కూడా సేకరించినట్లు తెలిసింది.

Read Also : Handloom Workers: నేతన్నలకు రూ.లక్షలోపు రుణమాఫీ

#BRS #KCR #TelanganaPolitics Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.