📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

కాంగ్రెస్ హామీల అమలుకు కవిత పోస్ట్‌కార్డు ఉద్యమం

Author Icon By Vanipushpa
Updated: March 6, 2025 • 1:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో మహిళలకు ఎన్నికల హామీల అమలుపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, MLC కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు మహిళలు కాంగ్రెస్ నేతలకు పోస్ట్‌కార్డు ద్వారా ఉత్తరాలు పంపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీల అమలు లేకపోవడం నిరసనకు దారి తీశింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, హామీలను తక్షణమే అమలు చేయాలని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌లకు ఉత్తరాలు రాశారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు ₹2500 నగదు సహాయం. ఇప్పటికీ అమలు చేయలేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లైన ప్రతి ఆడబిడ్డకు ఒక తులం బంగారం ఇవ్వాలని హామీ ఇచ్చారు.
మహిళలు ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. డిగ్రీ చదివిన ప్రతి అమ్మాయికి స్కూటీ ఇవ్వాలని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో నిరసన వ్యక్తమవుతోంది.

తెలంగాణ మహిళల ఆగ్రహం
కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు పూర్తి చేసుకున్నప్పటికీ హామీలను అమలు చేయలేదని మహిళలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆరోపణలు వచ్చాయి.
వాగ్దానాలు నెరవేర్చని పక్షంలో ఢిల్లీలో సోనియా గాంధీ ఇంటి ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గ్రామ మహిళలు కలిసి పోస్ట్‌కార్డుల ద్వారా తమ డిమాండ్లను కాంగ్రెస్ అధినాయకత్వానికి తెలిపారు. ఈ ఉద్యమంలో గాడ్గే మీనాక్షి, అర్చన, రేణుకబాయి, ఇందుబాయి తదితరులు పాల్గొన్నారు. హామీల అమలు ఆలస్యమైతే తెలంగాణవ్యాప్తంగా మహిళలు ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలని సిద్దమవుతున్నారు.

పెద్దఎత్తున ఉద్యమాలు

కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయకుంటే పెద్దఎత్తున ఉద్యమాలు జరుగుతాయని హెచ్చరించారు. తెలంగాణలో మహిళలకు కాంగ్రెస్ హామీల అమలు ఆలస్యం కావడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. హామీలు నెరవేర్చకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని మహిళలు సిద్ధమవుతున్నారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu mlc kavitha Paper Telugu News postcard-campaign Telangana Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.