Delhi liquor scam : కవితకు సీబీఐ షాక్, కోర్టు తీర్పుపై హైకోర్టులో సవాలు

Read Time:  1 min
Delhi liquor policy
Delhi liquor policy
FONT SIZE
GET APP

Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసులో ఆమెకు ఊరటనిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ కేసు మరోసారి కీలక మలుపు తీసుకుంది.

ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి, తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన కవితకు సీబీఐ తాజా నిర్ణయం కొత్త చిక్కులు తెచ్చే అవకాశముందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చే వారం హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

Read Also: Hyderabad Crime: తండ్రి మందలించడంతో 12 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య

Delhi liquor scam
Delhi liquor scam

2021లో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం విధానంపై పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగాయి. మద్యం దుకాణాల లైసెన్సింగ్ విధానంలో మార్పులు చేసి ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారని, దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గి ప్రైవేట్ సంస్థలకు అక్రమ లాభాలు చేకూరాయని ఆరోపణలు వచ్చాయి.

ఈ విధానం తమకు అనుకూలంగా ఉండేలా చేయడానికి కవితకు సంబంధం ఉన్నట్లు భావిస్తున్న “సౌత్ గ్రూప్” ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇండో స్పిరిట్స్ అనే మద్యం సంస్థలో బినామీల ద్వారా పెట్టుబడులు పెట్టి, ఆ కంపెనీ ద్వారా లాభాలు పొందినట్లు కూడా అభియోగాలు ఉన్నాయి. ఈ ఆరోపణలను కవిత పలు సందర్భాల్లో ఖండించారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.