📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Kavitha: తీవ్ర అసంతృప్తితో కవిత మరో పార్టీ లోకి జంప్?

Author Icon By Anusha
Updated: May 28, 2025 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కటం లేదని, తన పైన కుట్రలు చేస్తున్నారని బాహాటంగా వాపోయిన కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు రావడంతో ఆ లేఖ ఎలా బయటకు వచ్చిందో చెప్పాలంటూ కవిత డిమాండ్ చేశారు. కెసిఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళే దెయ్యాలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఒకరకంగా అన్న కేటీఆర్ ను టార్గెట్ చేసిన కవిత తనదైన వ్యాఖ్యలు చేశారు. ఇక కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ అంతర్గత విషయాలను అంతర్గతంగా చర్చించాలంటూ ఇన్ డైరెక్ట్ గావ్యాఖ్యానించారు. ఆపై కవిత కొత్త పార్టీ పెడతారని జరుగుతున్న చర్చ, తెలంగాణ జాగృతి నేతలతో కవిత నిర్వహిస్తున్న సమావేశాలు వెరసి బిఆర్ఎస్ రాజకీయం రసవత్తరంగా మారింది.మొన్నటికి మొన్న కేటీఆర్, కెసిఆర్(KCR) తో భేటీ అయ్యి కవిత వ్యవహారం పైన చర్చించారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలకు కవిత వ్యవహారం పైన ఎవరూ మాట్లాడవద్దని అంతర్గతంగా సూచించారు. ఇక అన్న చెల్లెలు పంచాయితీపైన తెలంగాణ రాజకీయాలలో రచ్చ కొనసాగుతున్న వేళ, బీఆర్ఎస్ పార్టీలోను గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో పరిస్థితులు చేయి దాటిపోతున్న క్రమంలో కవిత వద్దకు కెసిఆర్ తన దూతలను పంపించారు.

ప్రాధాన్యత

కవితకు గల అసంతృప్తికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనేక అంశాలపైన చర్చించిన తర్వాత వీరి చర్చలు విఫలమైనట్టు తెలుస్తుంది. తనకు బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత లేకుంటే తన దారి తాను చూసుకుంటానని కవిత కెసిఆర్ కి చెప్పినట్లుగా సమాచారం. కొత్తపార్టీ(New Party) పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారని సమాచారం. బీఆర్ఎస్(BRS) లో కవితకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో, ఆ పార్టీలో ఆమె ఉండాలని అనుకోవడం లేదని కవిత అనుచరులు కూడా చెబుతున్నారు.

ప్రచారం

ఈ క్రమంలోనే కవిత వరుసగా తెలంగాణ జాగృతి నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ కమిటీలను వేస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. ఇక కవిత జూన్ రెండవ తేదీన కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. కేటీఆర్(KTR) నాయకత్వాన్ని కవిత(Kavitha) అంగీకరించటం లేదని, ఈ క్రమంలోనే కవిత కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతున్న వేళ, పార్టీలో ప్రాధాన్యం విషయాల్లో కవిత తండ్రికి తెగేసి చెప్పినట్టు ప్రస్తుతం చర్చ జరుగుతుంది.అదేవిందంగా తీవ్ర అసంతృప్తితో కవిత మరో పార్టీ లోకి జంప్ అయ్యేటట్లు సమాచారం.

Read Also : KCR: వరుస కేసులతో రూటు మార్చిన కెసిఆర్

#KavithaKalvakuntla #KavithaMeeting #MLCKavitha #TelanganaJagruthi Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.