📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Karimnagar: ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న కరీంనగర్ కలెక్టర్‌

Author Icon By Anusha
Updated: June 16, 2025 • 2:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరిగేలా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా మారుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలోనే తన శస్త్రచికిత్స చేయించుకోవడమే కాదు, అక్కడి వైద్యులపై నమ్మకంతో చికిత్స పూర్తి చేయించుకోవడం ద్వారా ఆమె ప్రభుత్వ వైద్య వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రస్తావించి, ఆమెను అభినందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.వివరాల్లోకి వెళితే, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 

ఆధునిక సదుపాయాలు

ఈ క్రమంలో, ఆమె నిన్న కరీంనగర్‌లోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఈఎన్టీ (చెవి, ముక్కు, గొంతు) విభాగానికి చెందిన నిపుణులైన వైద్యుల బృందం ఆమెకు విజయవంతంగా ఎండోస్కోపీ నేసల్ సర్జరీ, సెప్టోప్లాస్టిక్టి సర్జరీలను నిర్వహించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈరోజు ఎక్స్ వేదికగా స్పందించారు. “ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాలు, అనుభవం ఉన్న వైద్యులు ఉన్నారు. సర్కారు దవాఖానలో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకం ప్రజలందరిలో కలగాలి.ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి నా అభినందనలు” అని తన పోస్టులో పేర్కొన్నారు.

Karimnagar

అపోహలు తొలగిపోవచ్చు

ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ సేవలను వినియోగించుకోవడం ద్వారా ప్రజల్లో వాటిపై విశ్వాసం పెరుగుతుందని, కలెక్టర్ పమేలా సత్పతి (Collector Pamela Satpathy) చర్య ఇందుకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడం.సామాన్యులకు కూడా సర్కారు వైద్యంపై భరోసా కల్పించే దిశగా ఒక మంచి పరిణామంగా భావిస్తున్నారు.కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తీసుకున్న ఈ చిన్న నిర్ణయం, ప్రభుత్వ వైద్య రంగంపై మంచి సందేశాన్ని ఇచ్చింది. దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వ హాస్పిటళ్ల పట్ల ఉన్న అపోహలు తొలగిపోవచ్చు. అధికారుల చొరవ, ప్రభుత్వ వైద్యుల నైపుణ్యం సమ్మిళితమై ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందించగలమన్న విశ్వాసం బలపడుతుంది.

Read Also: Rain: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు

#GovernmentHospital #KarimnagarCollector #PamelaSathpathy #RevanthReddy Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.