News Telugu: Jubilee Hills: జూబ్లీహిల్స్ ఎన్నికలు.. సీఎం రేవంత్ రెడ్డికి అగ్నిపరీక్ష

Read Time:  1 min
Jubilee Hills
Jubilee Hills
FONT SIZE
GET APP

Jubilee Hills: రేపు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (63) అకాలమరణంతో జూబ్లీహిల్స్ కు తప్పనిసరిగా ఉప ఎన్నికల అనివార్యమైంది. దీంతో బీఆర్ ఎస్ నాయకుడు కేసీఆర్ ఆ సీటును మాగంటి హరినాథ్ భార్య మాగంటి సునీతను నిలవబెట్టారు. కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ పోటీచేయనున్నారు. ఇక బీజేపీ తరపున లంకల దీపక్ పోటీ చేస్తున్నారు. రేపు (మంగళవారం) ఇక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మూడు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అనేలా ప్రచారం నిర్వహించారు. ఓటర్లకు భారీగా బహుమతుల ఆశ చూపిస్తున్నారు. మందు, బిర్యానీలతో పాటు డబ్బును కూడా పంచుతున్నారు. దీంతో ఇక్కడ ఎవరు గెలుస్తారు అనే విషయం సందిగ్ధం నెలకొంది.

Read also: Supreme court: స్పీకర్‌పై కేటీఆర్ ధిక్కార పిటిషన్

Jubilee Hills

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఎన్నికలు.. సీఎం రేవంత్ రెడ్డికి అగ్నిపరీక్ష

ఉప ఎన్నికలను ప్రతిష్ఠగా తీసుకున్న రేవంత్ రెడ్డి

Jubilee Hills: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) ఈ ఎన్నికలను తన ఒక ప్రత్యేక స్టేటస్ గా తీసుకున్నారు. ఎలాగైనా ఆ సీటును కాంగ్రెస్ కొట్టాలని ఎమ్మెలు, మంత్రులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆరు గ్యారంటీలలో ఒకట్రెండు త్వరలోనే అమలు చేస్తామని రేవంత్ రెడ్డి నేడు ప్రకటిస్తారని అందరూ భావిస్తున్నారు. మరికాసేపట్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అమలుపై సమీక్షించనున్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.