News Telugu: Jubilee Hills: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు!

Read Time:  1 min
Jubilee Hills
Jubilee Hills
FONT SIZE
GET APP

Jubilee Hills: హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ (jubilee hills) ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నగర పోలీసులు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల కీలక నేతలపై చర్యలు తీసుకున్నారు. మొత్తం మూడు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, రాందాస్‌లపై రెండు కేసులు, బోరబండ పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌లపై మరో కేసు నమోదైనట్లు సమాచారం.

Read also: JubileeHills election: ఓటు హక్కు వినియోగించుకున్న గోపీచంద్

Jubilee Hills

Jubilee Hills: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు!

ఎన్నికల నిబంధనలను గౌరవించాలని

Jubilee Hills: అధికారులు ప్రాథమిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ ఘటనలపై స్పందిస్తూ, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలంటే ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను గౌరవించాలని సూచించారు. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం ఉన్న వారు వెంటనే డయల్ 100 ద్వారా తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఎవ‌రిపై కేసులు నమోదయ్యాయి?
ఎమ్మెల్యేలు బీర్ల ఐల‌య్య, రామ‌చంద్ర నాయ‌క్‌, రాందాస్‌, అలాగే మాజీ ఎమ్మెల్యేలు దాస్యం విన‌య్ భాస్కర్‌, మెతుకు ఆనంద్‌పై కేసులు నమోదయ్యాయి.

కేసులు ఎందుకు నమోదయ్యాయి?
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.